AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్‌ జాతికి అంకితం చేసేందుకు టైమ్ ఫిక్స్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్ట్‌పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నట్టు ప్రకటించారు. అంతకంటే ముందే.. పోలవరం ఎడమ కాల్వ నుంచి నీటి విడుదలకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. వచ్చే నెల 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇవ్వబోతున్నట్టు చంద్రబాబు వెల్లడించడం ఉత్తరాంధ్రకు ఊపిరిపోస్తోంది.

ఏపీ జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్‌ జాతికి అంకితం చేసేందుకు టైమ్ ఫిక్స్.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Cm Chandrababu Naidu
Shaik Madar Saheb
|

Updated on: Jul 14, 2026 | 7:42 AM

Share

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సందర్శించారు. ఏరియల్‌ వ్యూ ద్వారా పోలవరం పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టు స్పిల్‌ వే నుంచి గోదావరి వరద నీటి ప్రవాహం, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ మధ్య జరుగుతున్న పనులను తిలకించారు. పోలవరం పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపైనా అక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా.. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి.. జాతికి అంకితం చేయబోతున్నట్టు వెల్లడించారు. వచ్చే మార్చి నాటికి ఏపీ ప్రజల దశాబ్ధాల కోరిక నెరవేరబోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

అంతకంటే ముందు.. వచ్చే నెల ఆగస్ట్‌ 14న పోలవరం ఎడమ కాలువకు నీటిని విడుదల చేయబోతున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనకాపల్లి జిల్లాలో గోదావరికి అఖండ హారతి ఇస్తామని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పటివరకు 37 సార్లు పోలవరం ప్రాజెక్ట్‌ను స్వయంగా పరిశీలించడంతోపాటు.. 136సార్లు సమీక్ష నిర్వహించామని చెప్పారు. అలాగే.. కేంద్రంతో అనేకసార్లు మాట్లాడి.. పోలవరం నిధులు విడుదల అయ్యేలా చూశామన్నారు. బైట్‌.. చంద్రబాబు, ఏపీ సీఎం

మరోవైపు.. పోలవరం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అప్పట్లో పోలవరం పనులు నిలిచిపోవడంతో నిద్రలేని రాత్రులు గడిపామని గుర్తు చేశారు.

మొత్తంగా.. పోలవరం ప్రాజెక్ట్‌ ప్రారంభానికి సీఎం చంద్రబాబు డేట్‌ ఫిక్స్‌ చేశారు. వచ్చే ఏడాది మార్చిలో జాతికి అంకితం చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతకుముందే.. వచ్చే నెల ఆగస్టు 14న పోలవరం ఎడమ కాల్వ ద్వారా గోదావరి నీటిని విడుదల చేసి.. అనకాపల్లి జిల్లాలో అఖండ హారతి ఇవ్వబోతున్నట్టు వెల్లడించడంతో ఏపీ ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

Follow Us