AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. కన్న కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?

అనంతపురం నగరంలో కలకలం రేపిన ఘటనలో, మద్యానికి బానిసైన కొడుకు వేధింపులు భరించలేక తల్లి అతడిపై దాడి చేసిన ఘటన విషాదానికి దారితీసింది. పోలీసుల వివరాల ప్రకారం, సురేంద్ర అనే యువకుడు మద్యం కోసం తరచూ డబ్బులు డిమాండ్ చేస్తూ తల్లి సునీతను మానసికంగా వేధించేవాడని తెలుస్తోంది

Andhra: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. కన్న కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?
Mother Kills Son
Shaik Madar Saheb
|

Updated on: Jul 14, 2026 | 6:53 AM

Share

అనంతపురం నగరంలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ ఘటన వెలుగుచూసింది. కొడుకు వేధింపులు భరించలేక కన్నతల్లే కత్తెరతో దారుణంగా పొడిచి హత్య చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం నగరానికి చెందిన సురేంద్ర (28) అనే యువకుడు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జులాయిగా తిరుగుతూ, మద్యం తాగడం కోసం డబ్బులు కావాలంటూ నిత్యం తల్లి సునీతను వేధించేవాడు. రోజురోజుకూ సురేంద్ర పెట్టే చిత్రహింసలు, మానసిక వేధింపులు ఎక్కువయ్యాయి.

ఎప్పటిలాగే నిన్న కూడా కొడుకు గొడవ పడటంతో తీవ్ర ఆగ్రహానికి లోనైంది. విసిగిపోయిన తల్లి సునీత.. ఇంట్లో ఉన్న కత్తెరను తీసుకుని సురేంద్ర గొంతులో బలంగా పొడవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న అనంతపురం మూడో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.

ఈ ఘాతుకానికి పాల్పడిన తల్లి సునీతపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వేధింపుల వల్లే ఈ హత్య జరిగిందా లేక దీని వెనుక ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
దారుణం.. కన్న కొడుకును కత్తెరతో పొడిచి హత్య చేసిన తల్లి
దారుణం.. కన్న కొడుకును కత్తెరతో పొడిచి హత్య చేసిన తల్లి
పసిడి ప్రియులకు బిగ్‌ రిలీఫ్.. మళ్లీ దిగొస్తున్న బంగారం, వెండి
పసిడి ప్రియులకు బిగ్‌ రిలీఫ్.. మళ్లీ దిగొస్తున్న బంగారం, వెండి
పిల్లల ఫొటోలు షేర్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
పిల్లల ఫొటోలు షేర్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
ఆయుష్ పీజీ ప్రవేశాలకు AIAPGET 2026 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఆయుష్ పీజీ ప్రవేశాలకు AIAPGET 2026 అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల
వైఫైకి కాలం చెల్లిందా? కాంతి వేగంతో ఇంటర్నెట్ అందించేది...
వైఫైకి కాలం చెల్లిందా? కాంతి వేగంతో ఇంటర్నెట్ అందించేది...
ఈ వారం OTTల్లో 20కు పైగా కొత్త సినిమాలు.. ఆ రెండూ డోంట్‌ మిస్‌
ఈ వారం OTTల్లో 20కు పైగా కొత్త సినిమాలు.. ఆ రెండూ డోంట్‌ మిస్‌
ఇన్కాగ్నిటో మోడ్ వాడితే ప్రైవసీ పక్కా అనుకుంటున్నారా?
ఇన్కాగ్నిటో మోడ్ వాడితే ప్రైవసీ పక్కా అనుకుంటున్నారా?
అమావాస్య రోజున తప్పక చేయాల్సిన పనులు.. అస్సలు చేయకూడని పనులు ఇవే!
అమావాస్య రోజున తప్పక చేయాల్సిన పనులు.. అస్సలు చేయకూడని పనులు ఇవే!
సిమ్ కార్డ్ లేకపోయినా ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయి?
సిమ్ కార్డ్ లేకపోయినా ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయి?
జూలై 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
జూలై 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..