Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. మళ్లీ దిగొస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
బంగారం కొనుగోలు చేసే వారికి ఇది కాస్త ఊరట కల్పించే విషయమనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్క రోజే తులం బంగారంపై ఏకంగా రూ.1400పైగా తగ్గింది. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, డాలర్, రూపాయి విలువ మారకం కారణంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడూ మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అయితే పశ్చిమాసియాలో తాజాగా మళ్లీ రాజుకున్న ఉద్రిక్తతల కారణంగా మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కొన్ని రోజులు పెరుగుతూ వచ్చాయి. కానీ సడెన్‌గా సోమవారం ఈ ధరలు భారీ మార్పు కనిపించింది. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఒక్కరోజే తులం బంగారంపై ఏకంగా రూ.1400పైగా తగ్గింది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చూసుకుంటే.
మంగళవారం ఉదయం ఆరు గంటలకు దేశీయ మార్కెట్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,900గా ఉండగా ఈ ధర నిన్న రూ.1,42,910గా ఉంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,30,990గా ఉండగా 18 క్యారట్ల బంగారం ధర రూ.1,07,170 వద్ద కొనసాగుతుంది. ఇక అటు వెండి విషయానికి వస్తే.. ఇది కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద ట్రేడవుతుంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఇవే..
- హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,900 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,990గా ఉంది.
- విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,42,900 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,990 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,900 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,30,990 పలుకుతోంది
- బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,900 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,30,990కు లభిస్తోంది.
- దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,43,050 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,140 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,990గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,31,990 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు..
హైదరాబాద్, కేరళ, చెన్నై నగరాల్లో కేజీ వెండి ధర రూ.2,39,900గా ఉండగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు,పూణె, కోల్‌కతాలో మాత్రం కేజీ వెండి ధర రూ.2,34,900 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
