Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri Temple: సీఎం కేసీఆర్ నేటి యాదాద్రి పర్యటన రద్దు.. మళ్లీ ఎప్పుడు వెళ్లనున్నారంటే..

Yadadri Temple: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ్టి యాదాద్రి పర్యటన వాయిదా పడింది. బిజీ షెడ్యూల్ కారణంగా పర్యటనలో మార్పు చేశారు. వాస్తవానికి ఇవాళ యాదాద్రిలో పర్యటిస్తారని

Yadadri Temple: సీఎం కేసీఆర్ నేటి యాదాద్రి పర్యటన రద్దు.. మళ్లీ ఎప్పుడు వెళ్లనున్నారంటే..
Cm Kcr
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 14, 2021 | 9:15 AM

Yadadri Temple: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ్టి యాదాద్రి పర్యటన వాయిదా పడింది. బిజీ షెడ్యూల్ కారణంగా పర్యటనలో మార్పు చేశారు. వాస్తవానికి ఇవాళ యాదాద్రిలో పర్యటిస్తారని సీఎంవో ముందుగా ప్రకటించింది. కానీ, ఈ పర్యటన షెడ్యూల్‌ను తాజాగా రద్దు చేశారు. ఈనెల 17వ తేదీన మరోసారి చిన్న జీయర్ స్వామితో కలిసి యాదాద్రిలో పర్యటించనున్నారు. అయితే, ఈ ఏడాది అక్టోబ‌ర్, న‌వంబ‌ర్ మాసాల్లో యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవ‌కాశం ఉందని సమాచారం. ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్యట‌న‌కు వెళ్లిన సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆల‌య ప్రారంభోత్సవానికి రావాల‌ని ప్రధాని మోడీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే.. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసేలా అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదిలాఉంటే.. సీఎంఓ ముఖ్య కార్యద‌ర్శి భూపాల్ రెడ్డి ఈ నెల 11వ తేదీన ఆలయ పనులను ప‌రిశీలించిన సంగ‌తి తెలిసిందే. ప్రధానాలయం లిప్టు, రథశాల, క్యూ లైన్లు, క్యూ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. శ్రీవారి మెట్లు, శివాలయం, ప్రధానాలయం తుది మెరుగుల పనులను పరిశీలించి పనుల తీరుపై వైటీడీఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు. లిప్టు, రథశాలకు మరింతగా మెరుగులు దిద్దాలని సూచించారు. ప్రసాద విక్రయశాల వద్ద నిర్మించే ర్యాంపు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ దర్వాజలకు ఇత్తడి తొడుగులు బిగింపు ప్రక్రియ తీరును, తొడుగులు తయారీపై స్వర్ణకారులను భూపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు.

Also read:

Rain Alert: తెలంగాణకు మరోసారి భారీ వర్షసూచన.. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు..

Car Offers: కొత్త కారు కొనేవారికి బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.2.60 లక్షల వరకు తగ్గింపు..!

IPL 2021: వీరంతా కీలక బౌలర్లే.. భారీ ప్రైజ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ.. కానీ, నెట్ బౌలింగ్‌కే పరిమితం.. వారెవరంటే?