CM KCR: తెలంగాణ వైద్య రంగంలో నవశకానికి నాంది.. ఒకేరోజు తొమ్మిది వైద్య కళాశాలల ప్రారంభం

Telangana Medical Colleges: ఒకప్పుడు ప్రభుత్వ వైద్యం అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేది.. సౌకర్యాల లేమి.. వైద్యులు, సిబ్బంది కొరత ఇలా ఎన్నో సమస్యలు వెంటాడేవి.. ఇప్పుడు స్వరాష్ట్రంలో పరిస్థితులు మారాయి.. అత్యాధునిక వైద్యాన్ని ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం ముందడుగు వేసింది. వైద్య రంగంలో ప్రమాణాలు పెంచడంతోపాటు జిల్లాకో మెడికల్ కళశాలను నిర్మించింది.

CM KCR: తెలంగాణ వైద్య రంగంలో నవశకానికి నాంది.. ఒకేరోజు తొమ్మిది వైద్య కళాశాలల ప్రారంభం
CM KCR
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 14, 2023 | 2:11 PM

Telangana Medical Colleges: ఒకప్పుడు ప్రభుత్వ వైద్యం అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేది.. సౌకర్యాల లేమి.. వైద్యులు, సిబ్బంది కొరత ఇలా ఎన్నో సమస్యలు వెంటాడేవి.. ఇప్పుడు స్వరాష్ట్రంలో పరిస్థితులు మారాయి.. అత్యాధునిక వైద్యాన్ని ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం ముందడుగు వేసింది. వైద్య రంగంలో ప్రమాణాలు పెంచడంతోపాటు జిల్లాకో మెడికల్ కళశాలను నిర్మించింది. వైద్య విద్యను ప్రొత్సహించడంతోపాటు.. అట్టడుగు వర్గాలకు వైద్య విద్యను అందించేందుకు వైద్య విద్యలో సీట్లను కూడా పెంచింది. లక్షల్లో సీట్లు కొని చదవలేని వారికి వైద్య విద్య అందుబాటులో ఉండే విధంగా సంచలన నిర్ణయాలు తీసుకుంది. అంతేకాకుండా మెడికల్ రంగంలో ఎన్నడూ లేని మార్పులకు శ్రీకారం చుట్టి.. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో నవ చరిత్రను లిఖించబోతోంది.. సీఎం కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేనంతగా వైద్య విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తూ జిల్లాకో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ఇప్పటికే జిల్లాల వారీగా మెడికల్ కళాశాల నిర్మాణం కూడా పూర్తయింది. అయితే, రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా నిర్మించిన తొమ్మిది మెడికల్‌ కాలేజీలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుక్రవారం ప్రారంభించనున్నారు.

రాష్ట్రంలోని కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్‌ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లా కేంద్రాల్లో కొత్తగా తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మెడికల్‌ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర నిధులతో ఒకే ఏడాది ఇంత పెద్దసంఖ్యలో మెడికల్‌ కాలేజీలు ప్రారంభించడం దేశంలోనే ఇదే ప్రథమం..

కేసీఆర్‌ హయాంలో 21 మెడికల్‌ కళాశాలలు

వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అయితే, దశాబ్ద కాలంలోనే సీఎం కేసీఆర్‌ 21 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశారు. అయితే, వచ్చే ఏడాది నాటికి మంజూరు చేసుకున్న వాటిలో 8 మెడికల్‌ కాలేజీల నిర్మాణంతో ప్రతి జిల్లాకూ ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు పూర్తవుతుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

2014లో 5 మెడికల్‌ కాలేజీల ద్వారా తెలంగాణలో 850 సీట్లు ఉంటే, 2023 నాటికి 26 మెడికల్‌ కాలేజీలతో సీట్ల సంఖ్య 3,690కి చేరకుంది. ప్రభుత్వ ప్రైవేటులో కలిపి ఏటా పది వేల మంది విద్యార్థులను తయారు చేసే స్థాయికి నేడు తెలంగాణ చేరుకుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

2014 జూన్‌ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లోని కాంపిటేటివ్‌ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్‌ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కాలేజెస్‌ అడ్మిషన్‌ రూల్స్‌ కు ప్రభుత్వం చేసిన సవరణ తరువాత వైద్య సీట్లు గణనీయంగా పెరిగాయి.

ఏది ఏమైనప్పటికీ సీఎం కేసీఆర్ నిర్ణయాలతో వైద్య రంగంలో తెలంగాణ ప్రభుత్వం నవ శకానికి నాంది పలుకుతోందని చెప్పవచ్చు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!