Telangana Schools Reopen: తెలంగాణ పాఠశాలలు పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష.. రీ-ఓపెన్ ఎప్పటి నుంచంటే..?

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకాలం మూతపడ్డ పాఠశాలల పునఃప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

Telangana Schools Reopen: తెలంగాణ పాఠశాలలు పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష.. రీ-ఓపెన్ ఎప్పటి నుంచంటే..?
Cm Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 23, 2021 | 4:32 PM

CM KCR on Schools Reopen: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇంతకాలం మూతపడ్డ పాఠశాలల పునఃప్రారంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు హాజరయ్యారు. తెలంగాణాలో విద్యాసంస్థల ప్రారంభంపై స‌ర్కార్ మ‌ల్లగుల్లాలు ప‌డుతోంది. దేశంలో చాలా రాష్ట్రాలు క‌రోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తూ ప్రత్య‌క్ష బోధన ప్రారంభించారు. ఇక్కడ మాత్రం పాఠ‌శాల‌ల‌ను తెరిచేందుకు స‌ర్కార్ వెన‌క‌డుగు వేస్తోంది. కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో.. విద్యా సంస్థలు తెరవడానికి వైద్య ఆరోగ్య శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సెప్టెంబరు 1 నుంచి పాఠశాలలు, కాలేజీలను తెరవాలని విద్యాశాఖ భావిస్తోంది. స్కూళ్లు తెరిచేందుకు అనుమ‌తి ఇవ్వాలంటూ విద్యాశాఖ ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాద‌న‌లు పంపింది.

సెప్టెంబ‌ర్ 1నుంచి హైస్కూల్‌తో పాటూ ఇంట‌ర్, డిగ్రీ ఇంజ‌నీరింగ్‌లో ప్రత్యక్ష బోధన‌కు విద్యాశాఖ అన్ని ఏర్పాట్ల‌ు చేసింది. అయితే, స్కూళ్లను ఎప్పటినుంచి ప్రారంభించాల‌నే అంశంపై ప్రభుత్వం త‌ర్జన భర్జన పడుతున్నట్లు స‌మాచారం. విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. మొదటి దశలో 8, 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌, డిగ్రీ, ఇతర కళాశాలల్లోకి విద్యార్థులను అనుమతించాలని యోచిస్తున్నారు. తర్వాత కిందిస్థాయి తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఆగస్టు తొలివారంలోనే పలు రాష్ట్రాలు ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాయి.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని త్వరలో విద్యా సంస్థలను తెరవడానికి ముహూర్తం ఖరారు చేశాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, యూనిసెఫ్‌, పార్లమెంట్ స్థాయీ సంఘం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ తదితర విభాగాలు సైతం విద్యాసంస్థలను తెరవాలని సూచించాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా పాఠశాలలు తెరచుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.ఈ క్రమంలో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన మొదలుపెట్టాలని విద్యాశాఖ ఆలోచిస్తోంది. ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలను (ప్రస్తుతం ద్వితీయ ఇంటర్) 15 రోజులు గడువు ఇచ్చి జరపాలని భావిస్తోంది.

Read Also…  Minister Botsa: న్యాయస్థానాన్ని ఒప్పిస్తాం.. న్యాయస్థానం ఆదేశాలతోనే వెళ్తాం.. మూడు రాజధానులపై మంత్రి బొత్స