KCR: ఢిల్లీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కి భూమిపూజ.. సరిగ్గా ముహూర్తానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Sep 02, 2021 | 2:17 PM

దేశరాజధాని హస్తినలో TRS భవన్‌ నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణ స్థలం దగ్గరకు తెలంగాణ ముఖ్యమంత్రి

KCR:  ఢిల్లీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కి భూమిపూజ.. సరిగ్గా ముహూర్తానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
Trs Office Delhi

Follow us on

Delhi TRS Bhavan: దేశరాజధాని హస్తినలో TRS భవన్‌ నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణ స్థలం దగ్గర సీఎం కేసీఆర్ పూజలో పాల్గొన్నారు. వేద పండితులు కేసీఆర్ పూజా పునస్కారాలు చేయించారు. ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో జరిగిన తెలంగాణ భవనం కోసం కేటాయించిన సదరు స్థలంలో భూదేవ‌త‌కు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూజ‌లు చేశారు. నిర్మాణ స్థలంలో వేద పండితులు శాస్త్రోక్తంగా పూజ‌లు జరిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కిాంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోపాటు, టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా,  టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణం కోసం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది కేంద్రం. ఇప్పటి వరకూ దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు లేదు. సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన డీఎంకే, ఏఐడీఎంకే, టీడీపీ, జనతాదళ్ ఎస్ వంటి పార్టీలకు ఇక్కడ ఎలాంటి భవనం లేదు. ఒక్క సమాజ్ వాది పార్టీకి తప్ప ప్రాంతీయ పార్టీలకంటూ ఢిల్లీలో సొంత భవన సదుపాయమే లేదు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలుంటే.. ఇప్పటి వరకూ వీటిలో ఏ ఒక్క పార్టీకీ సొంత భవనం లేదు. ఇపుడీ గులాబీ భవన నిర్మాణంతో టీఆర్ఎస్ కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోందని అంటున్నాయి గులాబీ శ్రేణులు.

40 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీ ప్లస్ 3 భవన సముదాయంతో TRS భవన్‌ను నిర్మించనున్నారు. మీటింగ్‌ హాల్‌తో పాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చే వారు స్టే చేసేందుకు అన్ని వసతులుండేలా ఈ భవన నిర్మాణాన్ని డిజైన్ చేశారు. అయితే TRS భవన్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను పోలి ఉంటుందని అంటున్నారు పార్టీ వర్గాల వారు.

వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే శంకుస్థాపన కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్‌ వేవ్, లాక్‌డౌన్‌ వల్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఏడాదిలోపే నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా గ్రాండ్‌గా జరపాలని ప్లాన్ చేశారు.

సీఎం కేసీఆర్ రాక సందర్భంగా ఢిల్లీలో టిఆర్ఎస్ భవన్ శంకుస్థాపన సందర్భంగా ఢిల్లీ పురవీధులు గులాబి మయమయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి నాయకత్వం అప్పటికే ఢిల్లీకి చేరుకోవడంతో తెలంగాణ భవన్ పరిసర భవనాలన్నీ టీఆర్ఎస్ నేతలతో కోలాహాలంగా మారాయి.

Read also: Nagarkurnool: గుత్తేదార్ల గుట్టు రట్టైంది.. కోట్ల రూపాయల ప్రజా సంపద కొట్టుకుపోయి సాక్ష్యంగా నిలిచింది

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu