AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: దివ్యాంగులు, పెన్షన్‌దారులు, డివిజన్‌కు ఎల్లుండి జీవో.. దిల్ ఖుష్.. మెదక్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు..

CM KCR IN MEDAK: మెదక్ జిల్లా పర్యటనలో మరో సంచలనానికి తెరతీశారు సీఎం కేసీఆర్. 3016 ఉన్న పెన్షన్‌ను 4016 రూపాయలకు పెంచి దివ్యాంగుల చేతికి చెక్కులు ఇచ్చారు గులాబీ దళపతి. మెదక్ జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చిన సీఎం కేసీఆర్.. పెంచిన పెన్షన్‌ సొమ్మును లబ్దిదారులకు పంపిణీ చేశారు. దివ్యాంగులతో పాటు బీడీ టేకేదారులు, ప్యాకర్లకు 2016 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

CM KCR: దివ్యాంగులు, పెన్షన్‌దారులు, డివిజన్‌కు ఎల్లుండి జీవో.. దిల్ ఖుష్.. మెదక్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు..
Cm Kcr In Medak
Sanjay Kasula
|

Updated on: Aug 23, 2023 | 10:19 PM

Share

మెదక్‌, ఆగస్టు 23: మెదక్‌లో ప్రగతి శంఖారావం పూరించారు సీఎం కేసీఆర్‌. పెద్ద రాష్ట్రాలను తలదన్ని తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన బీఆర్‌ఎస్‌కు మరోసారి అధికారం కట్టబెట్టాలని కోరారు. అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామన్నవారిని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు కేసీఆర్‌. అనతికాలంలోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు సీఎం కేసీఆర్‌. మెదక్‌ కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ జిల్లా ఆఫీసును ముఖ్యమంత్రి ప్రారంభించారు. నేతలు, అధికారులతో కలిసి వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. సీఎం వెంట మంత్రులు హరీష్‌రావు, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సీఎస్‌ శాంతికుమారి ఉన్నారు.

ప్రగతి శంఖారావం సభలో సీఎం కేసీఆర్‌ మెదక్‌జిల్లాపై వరాల జల్లు కురిపించారు. మెదక్‌జిల్లా మున్సిపాల్టీకి 50కోట్లు, నర్సాపూర్, రామాయంపేట, తూఫ్రాన్‌లకు 25కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మెదక్‌కు రింగ్‌రోడ్డు, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒక్కో గ్రామపంచాయతీకి 15 లక్షలు చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఏడుపాయల దేవాలయం అభివృద్ది పనులకు వందకోట్లు రూపాయలు కేటాయిస్తామన్నారు కేసీఆర్‌.తెలంగాణ రాకముందు పరిపాలన చేతకాదని విమర్శించారని, పరిపాలన సజావుగా సాగుతుందనేందుకు ఈ కార్యాలయాలే నిదర్శమన్నారు కేసీఆర్‌. 70 ఏళ్లుగా రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటకను కూడా అధిగమించి తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు.

24 గంటల కరెంట్‌, పరిశుభ్రమైన తాగునీరు అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణయేనన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దివ్యాంగుల పింఛను 3వేల నుంచి 4,016కు పెంచామన్నారు. తెలంగాణ రాకముందు 24 లక్షల పింఛన్లు ఉంటే, తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 50లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. ధరణిని వద్దన్న పార్టీలను బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ ఆర్థిక ప్రగతి సాధించింది కాబట్టే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత ఆర్థిక ప్రగతి సాధించి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు.

ఆర్థిక ప్రగతికి ఇదే నిదర్శనం..

ఒకప్పుడు 200 రూపాయల పెన్షన్‌ ఇచ్చే వాళ్లు. ఇప్పుడిది 4వేలకు పెరిగింది. అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేళ్లలో.. చేసిన అభివృద్ధికి, తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతికి ఇదే నిదర్శనం అన్నారు సీఎం కేసీఆర్. అతి త్వరలోనే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ మరో వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామన్నారు.

మొత్తానికి ఒక్కో జిల్లాను చుట్టేస్తూ.. ఒక్కో చోట ఒక్కో హామీ ఇస్తూ వెళ్తున్నారు సీఎం కేసీఆర్. ఓవైపు కేసీఆర్ దూకుడు ఇలా ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ మాత్రం అనూహ్యంగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి