లైవ్ అప్‌డేట్స్: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ హైలెవల్ మీటింగ్

లాక్‌డౌన్ ఆంక్షలపై సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రగతి భవన్‌లో హైలెవల్ సమావేశం నిర్వహించబోతున్నారు. జిల్లాల్లో ప్రభావం తగ్గినా.. గ్రేటర్‌లో మాత్రం ప్రభావం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఏ నిర్ణయం...

లైవ్ అప్‌డేట్స్: లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ హైలెవల్ మీటింగ్
Follow us

| Edited By:

Updated on: May 15, 2020 | 3:40 PM

కరోనా వైరస్ నివారణ, లాక్‌డౌన్‌ సడలింపులపై ప్రారంభమైన సీఎం కేసీఆర్ హైలెవల్ సమవేశం. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, డీజీపీ, సీఎస్‌లు పాల్గొన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలపై తీవ్రంగా అధికారులతో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్.

కాగా జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గినా.. గ్రేటర్‌లో మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారింది. గురువారం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరిగాయి. వాటిలో దాదాపు అన్ని కేసులూ గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. కాగా ఇప్పటికే కరోనా వైరస్‌ని కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కూడా ఈ నెల 29వ తేదీ వరకూ పొడిగించారు. అందులోనూ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ సమయం కూడా ముగింపు దశలో ఉంది. దీంతో లాక్‌డౌన్‌పై కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ప్రజలు.

Read More:

మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!