కరోనా ఊరటః వైరస్‌ని పసిగట్టగలిగే మాస్కులు
మహమ్మారి కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అంత వరకూ ..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. జనవరి 22ప 17 మరణాలుగా ఉన్న లెక్క దాదాపు నాలుగు నెలల్లోనే మూడు లక్షలకు చేరుకుంది. అత్యధికంగా అమెరికాలో85 వేల మంది మరణించగా..బ్రిటన్‌లో 33 వేలు, ఇటలీలో 31 వేలు, ఫ్రాన్స్‌లో, స్పెయిన్‌లో చెరో 27 వేలు, బ్రెజిల్‌లో 13 వేలు, జర్మనీలో 7 వేలు, ఇరాన్లో 6 వేల మందికి పైగా కరోనా బలితీసుకుంది. వైరస్ వెలుగు చూసిన చైనాలో 4 వేల మందికి పైగా కరోనాకు బలయ్యారు. అయితే, తాజాగా కరోనా వైరస్‌ని పసిగట్టగలిగే ప్రత్యేకమైన మాస్క్‌లు వచ్చేస్తున్నాయి.!
ఇంతటి భయానక పరిస్థితికి కారణమైన వైరస్ అంతనికి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రపంచ శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. అయితే, మహమ్మారి కరోనా వైరస్‌ని కట్టడి చేయగల వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అంత వరకూ ఈ కోవిడ్ భూతం జనం ప్రాణాలను తినేస్తూనే ఉంటుందా అన్న భయాందోళన నెలకొంది. అయితే, వైరస్ వ్యాప్తి నుంచి జనం ఒకింత బయటడే వార్తను శాస్త్ర వేత్తలు ప్రకటించారు. కరోనాను పసిగట్టగలిగే మాస్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కరోనా రోగి చెంతన ఉంటే ఈ మాస్క్‌లో ప్రత్యేకమైన లైట్ వెలుగుతుందని చెప్పారు. చుట్టుపక్కల కరోనా వైరస్ ఉంటే వెంటనే వెలిగేలా ఈ మాస్కులను అభివృద్ధి చేస్తున్నారు హార్వర్డ్, మిచిగన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలోనూ ఎబోలా వైరస్ ను గుర్తించేందుకు ఇటువంటి మాస్కులనే తయారు చేసి వాడిన ఉందంతాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.
