CLP Meeting: ముగిసిన సీఎల్పీ సమావేశం.. సీఎం అభ్యర్థిపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ తీర్మానం
సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత ఖర్గేకి అప్పగించారు ఏఐసీసీ పెద్దలు. రెండు గంటల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి పంపారు.

సీఎల్పీ సమావేశం ముగిసింది. ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏక వాక్య తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులు ఢిల్లీకి పంపారు. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యత ఖర్గేకి అప్పగించారు ఏఐసీసీ పెద్దలు. రెండు గంటల్లో ఢిల్లీ అధిష్టానం నుంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశానికి మొత్తం 64మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇందులో ఏఐసీసీ ప్రతినిధులతోపాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు 40నిముషాల పాటు మీటింగ్ జరిగింది. సీఎల్పీ భేటీకి ముందే ఉత్తమ్, భట్టితో డీకే సమావేశమయ్యారు. కీలక నేతల అభిప్రాయాలను డీకే శివకుమార్ ముందే తెలుసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాజగోపాల్‌కి డీకే కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. సీఎల్పీ నేత ఎంపిక తర్వాత ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలవనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




