AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చదువుకు ఆధార్‌ గండం.. బడికి దూరమై బాలకార్మికులుగా మారుతున్న చిన్నారులు!

వీరికి చదువుకోవాలనే ఆశ ఉంది.. కానీ, ఆధార్ కార్డులు లేవు. దీంతో సంచార జాతుల పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. అధికారుల నుంచీ నిర్లక్ష్యమైన సమాధానం. వెరసి తాము చదువుకోకపోవడంతో.. ఇబ్బంది పడుతున్నామని.. తమ పిల్లలను చదించాలనే కోరిక ఉన్న.. ఆధార్ కార్డు లేకపోవడంతో.. చదువుకు దూరమవుతున్నారని.. తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా సార్లు అధికారులను కలిశామని.. కానీ ఎవ్వరూ ఆధార్‌ కార్డులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు..

Telangana: చదువుకు ఆధార్‌ గండం.. బడికి దూరమై బాలకార్మికులుగా మారుతున్న చిన్నారులు!
Children Of Nomadic Tribes
Srilakshmi C
|

Updated on: Jul 02, 2025 | 8:55 PM

Share

కరీంనగర్, జులై 2: వారి తల్లిదండ్రులు నిరాక్ష్యరాసులు. ఊరు.. ఊరు తిరుగుతూ.. జీవనాన్ని కొనసాగించారు. అయితే తమ లాగా.. పిల్లలు ఉండకూడదని… చదివించాలని ఆశపడుతున్నారు. అయితే.. వారి ఆశలు అడియాశాలుగా మారుతున్నాయి.. వీరికి.. బర్త్ సర్టిఫికేట్ లేకపోవడంతో.. ఆధార్ కార్డులు ఇవ్వడం లేదు. దీంతో.. చదువుకోవాలనే ఆశ ఉన్న బడి మెట్లను ఎక్కనివ్వడం లేదు. వీరి భష్యత్ ఇప్పుడు.. అంధకారంగా మారింది. అధికారులు పట్టించుకొని.. ఆధార్ కార్డు మంజూరు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తుల సంచార జాతులు ఉన్నాయి.. వీరు.. ఊరు ఊరు తిరుగుతూ.. ఎదో పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే.. ఇందులో చాలా మందికి బర్త్ సర్టిఫికెట్ లేవు. ఇప్పటికీ.. కొంత మంది మహిళలు ఇంటి వద్దనే ప్రసవిస్తున్నారు. దీని కారణంగా.. పిల్లలకు బర్డ్ సర్టిఫెకెట్ ఉండటం లేదు. ఇప్పుడు వీరు పాఠశాలకు వెళ్లాలంటే ఆధార్ కార్డ్ ఉంటేనే పేరును ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. కానీ.. ఆధార్ కార్డు లేదు. దీంతో పిల్లలు కొన్ని రోజుల పాటు పాఠశాలకు వెళ్లి బడి మానేస్తున్నారు. ఆరెపెల్లి గ్రామంలో పెద్దమ్మల కులస్తులు కుటుంబాలు సుమారుగా 200 వరకు ఉంటాయి. ఇందులో పిల్లలు 60 మందికి పైగానే ఉన్నారు. వీరంతా కూడా పదేళ్లలోపు పిల్లలు. ఎవరికీ ఆధార్ కార్డు లేదు. దీని కారణంగా చదువుకోలేకపోతున్నారు. ఆధార్ కార్డు ఉంటే.. కుల సర్టిఫికెట్ వి షయంలో ఇబ్బందులు వస్తున్నాయి.. సంచార జాతులు కావడంతో.. కుల సర్టిఫెకెట్ ఇవ్వడం లేదు. దీంతో.. చాలా మంది ఉన్నత చదువులకు వెళ్లడం లేదు. పాఠశాలలు ప్రారంభమైన తరువాత ఈ పిల్లలంతా పాటశాలలకు వెళ్లారు.

వారం రోజుల వరకు పాఠశాలకు వెళ్లారు. తరువాత ఆధార్ కార్డు అడగడంతో పాఠశాలకు వెళ్లడం మానేశారు. ఈ కుటుంబాలన్ని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వ హాస్టళ్లో వేలదేమంటే మళ్లీ ఇక్కడ కూడా ఆధార్ కార్డు సమస్యనే. దీని కారణంగా ఇంటి వద్దనే ఉంటూ కూలీలుగా మారిపోతున్నారు. ప్రభుత్వం ఓ వైపు బాల కార్మికుల నిర్మూలన కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తే ఇక్కడ మాత్రం.. ఆధార్ కార్డు లేకపోవడంతో బాల కార్మికులుగా మారిపోతున్నారు. ఇక కొంత మంది పిల్లలు ఇంటి వద్దనే చదువుకుంటున్నారు. ఒక్కటి, రెండు తరగతులతో పాఠశాల మానేస్తున్నారు. ఈ వి షయంలో అధికారులు జోక్యం చేసుకొని ఈ పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించాలని స్వచ్చంద సంస్థలు కోరుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..