Crime news: పాలు వేడి చేసేందుకు స్టవ్ వెలిగిస్తే.. మంటలు చేలరేగి చిన్నారి మృతి
స్వరాష్ట్రంలో కూలీ పనులు లేకపోవడంతో చంటి పిల్లలతో వలస వచ్చిన ఓ కుటుంబం కన్నీటిసంద్రంలో మునిగింది. బిహార్(Bihar) రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. స్వగ్రామంలో పనులు లేకపోవడంతో కుటుంబంతో కలిసి..
స్వరాష్ట్రంలో కూలీ పనులు లేకపోవడంతో చంటి పిల్లలతో వలస వచ్చిన ఓ కుటుంబం కన్నీటిసంద్రంలో మునిగింది. బిహార్(Bihar) రాష్ట్రానికి చెందిన వ్యక్తి.. స్వగ్రామంలో పనులు లేకపోవడంతో కుటుంబంతో కలిసి వలస వచ్చాడు. స్థానికంగా పనులు చేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నారు. ఆనందంగా సాగిపోతున్న వారి కుటుంబంలో అగ్ని ప్రమాదం చిచ్చు రేపింది. గ్యాస్ లీక్ (Gas Leak) కారణంగా ఏర్పడిన మంటల్లో ఆ ఇంటి ఆశా కిరణం ఆరిపోయింది. మంటల్లో చిక్కుకుని ఐదేళ్ల కూతురు మృతి(Death) చెందింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. బిహార్ రాష్ట్రానికి చెందిన సునీల్ యాదవ్ తన భార్య, నలుగురు పిల్లలతో కలిసి నిజామాబాద్ జిల్లాలోని సారంగాపూర్ లో నివాసం ఉంటున్నారు. డెయిరీ ఫాంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఉంటున్నారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి పాలు సేకరించి నిజామాబాద్ లోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల కోసం పాలు వేడి చేసేందుకు ధన్వంతరి దేవి స్టవ్ వెలిగించారు. అప్పటికే గ్యాస్ లీక్ అవుతుండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో రెండేళ్ల చిన్నారి జగ్గును పట్టుకొని తల్లిదండ్రులు బయటకు పరుగులు తీశారు.
కానీ బబ్లూ, నమ్కి గదిలోనే చిక్కుకున్నారు. మంటలు భారీగా ఎగిసి పడటంతో ఇంట్లోకి వెళ్లడానికి వీలు కాలేదు. సమాచారం అందుకున్న స్థానికులు.. కిటీకీ పగలగొట్టి పిల్లలను బయటకు తీసుకు వచ్చారు. వైద్యం కోసం జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియాకు తరలిస్తుండగా చిన్నారి నమ్కి మృతి చెందింది. బబ్లూ పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన ముగ్గురు చికిత్స పొందుతున్నారు.
Also Read
Summer beauty tips: వేసవిలో ఆ ప్రదేశంలో దుర్వాసన రాకుండా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్స్ మీకోసమే..
Crime news: పరీక్షలో ఫెయిలవుతానేమోనని ప్రాణం తీసుకుంది.. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది