AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Prices: చికెన్ ప్రియులకు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?

చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏకంగా రూ.100 మేర డౌన్ అయింది. దీంతో చికెన్ ప్రియులు ఎగిరి గంతేస్తున్నారు. శ్రావణ మాసం కావడంతో చాలామంది నాన్ వెజ్ వంటకాలకు దూరంగా ఉంటున్నారు. దీని వల్ల కోళ్లకు డిమాండ్ తగ్గడం, ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో ధరలు పతనమవుతున్నాయి.

Chicken Prices: చికెన్ ప్రియులకు పండుగలాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో ఎంతంటే..?
Chicken Prices
Venkatrao Lella
|

Updated on: Sep 06, 2026 | 11:09 AM

Share

నాన్ వెజ్ ప్రియులకు గుడ్ న్యూస్. చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. గత కొద్ది రోజులుగా ధరలు పతనమవుతున్నాయి. శ్రావణ మాసం కావడంతో చికెన్‌కు డిమాండ్ తగ్గడమే ధరలు డౌన్ కావడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. శ్రావణ మాసం పూర్తయితే కోళ్లకు మళ్లీ డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం కిలో చికెన్ రూ.350 వరకు చేరుకోగా.. శ్రావణ మాసం ప్రారంభమయ్యాక రూ.250కి పడిపోయింది. ఇప్పుడు మరింతగా తగ్గి చికెన్ ప్రియులకు ఊరటనిస్తోంది. అటు కోడిగుడ్ల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు..

-హైదరాబాద్ జోన్‌లో కిలో స్కిన్ ‌లెస్ చికెన్ రూ.235 పలుకుతుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.208, రిటైల్ లైవ్ బర్డ్ రూ.134, ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.107కి చేరుకున్నాయి.

-కరీంనగర్ జోన్‌లో డ్రస్స్‌డ్ చికెన్ రూ.208, స్కిన్ లెస్ రూ.235గా ఉండగా.. ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.107, రిటైల్ లైవ్ బర్డ్ రూ.134గా ఉంది

-విజయవాడ జోన్‌లో ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. కిలో స్కిన్ లెస్ రూ.257కు లభిస్తుండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.228, రిటైల్ లైవ్ బర్డ్ రూ.147, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.120గా ఉంది.

కోడి గ్రుడ్ల ధరలు ఇవే..

-విజయవాడ జోన్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.75 పలుకుతుంది

-హైదరాబాద్, కరీంనగర్ జోన్‌లో 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.74గా ఉంది.

తగ్గిన ఉల్లిపాయల ధరలు

ఇక ఇటీవల పెరుగుతూ వచ్చిన ఉల్లిపాయల ధరలు ఇప్పుడు కాస్త శాంతిస్తున్నాయి. గత వారంలో పోలిస్తే కిలోకు రూ.10 మేర తగ్గాయి. కర్నూలు ఉల్లి మార్కెట్లకు చేరుకుంటుండటంతో ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్నూలు ఉల్లి క్వింటా రూ.3200 నుంచి రూ.3800 మధ్య ఉంది. మహారాష్ట్ర ఉల్లి క్వింటా రూ.4 వేల నుంచి రూ.4800 మధ్య విక్రయిస్తున్నారు. గత ఏడాది ఉల్లి వేసిన కర్నూలు రైతులు తీవ్రంగా నష్టపోవడంతో.. ఈ సారి పంట తగ్గించారు. ప్రస్తుతం ఉల్లి ధరలు పెరగంతో ఏడాది సాగు చేసిన రైతులు లాభపడుతున్నారు. మేలు జాతి రకం ఉల్లి పండించిన రైతులు ఎక్కువ లాభాలను అర్జిస్తున్నారు. ఇక కూరగాయల ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. టమాటా కిలో రూ.30, బీట్ రూట్ రూ.50, క్యాప్చికం రూ.80, బీన్స్ రూ.120, పొట్లకాయ రూ.30, ఆనప రూ.10, పచ్చిమిర్చి రూ.50 పలుకుతున్నాయి.

Follow Us