Telangana Cabinet: సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ….
Telangana Cabinete Expansion: ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణకు రెడీ అవుతోంది. మంగళవారం లేదా బుధవారం.. ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో ఉన్న ఒక ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉంది. గతంలో ఈటెల రాజేందర్ బర్తరఫ్‌తో ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయనున్నారు సీఎం కేసీఆర్. సామాజిక సమీకరణాల కోసం విస్తరణలో భాగంగా బండ ప్రకాష్ లేదా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి..
అభ్యర్థుల ప్రకటన ముగిసింది.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణకు రెడీ అవుతోంది. మంగళవారం లేదా బుధవారం.. ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో ఉన్న ఒక ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉంది. గతంలో ఈటెల రాజేందర్ బర్తరఫ్‌తో ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయనున్నారు సీఎం కేసీఆర్. సామాజిక సమీకరణాల కోసం విస్తరణలో భాగంగా బండ ప్రకాష్ లేదా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డికి చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం సమయం అడిగినట్లుగా తెలుస్తోంది. అయితే, రాజ్ భవన్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ రెండు రోజుల్లో సమయం ఇస్తే వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉండదనుంది. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థులను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మంత్రివర్గ విస్తరణ వార్తలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేసీఆర్ పరిశీలనలతో బండ ప్రకాష్, పట్నం మహేందర్ ఉన్నారు. ఇందులో ముదిరాజ్ సామాజికవర్గం నుంచి రేసులో బండ ప్రకాష్ .. రెడ్డి సామాజికవర్గం నుంచి పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్నారు ఇద్దరు నేతలు. మండలికి డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న బండ ప్రకాష్ కొన్నారు.
ప్రస్తుతం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాండిచ్చేరిలో ఉన్నారు. ఇవాళ రాత్రి వరకు హైదరాబాద్ రానున్నారు. వచ్చిన తర్వాత మంత్రి వర్గ మంత్రి వర్గ విస్తరణకు సమయం ఇవ్వనున్నారు. గవర్నర్ నిర్ణయం తీసుకుంటే ఎల్లుండి ప్రమాణ స్వీకరారం ఉండనుంది.
రాజకీయ చాణక్యంలో తనకు తానే సాటని మరోసారి నిరూపించుకున్నారు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్. నవంబర్, డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా… ఇంకా షెడ్యూల్ కూడా విడుదలవక ముందే … 4మినహా 115 స్థానాలకు రేసు గుర్రాల్ని అనౌన్స్ చేసేశారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల పూర్తి వివరాలు ఇవే..
#CMKCR #BRSCandidatesList #AssemblyElections2023 @TV9Telugu BRS అభ్యర్థుల జాబితాను ప్రకటించిన CM KCR pic.twitter.com/GODebxWOWd
— TV9 Telugu (@TV9Telugu) August 21, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి