Hyderabad: పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు.. హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల సామ్రాజ్యం..

గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్ పవర్ అనే వ్యక్తిని పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేశారు. బెగ్గింగ్ రాకెట్‌కు అనిల్ పవర్ కీలక సుత్రదరుడిగా ఉన్నాడు.. ఇతడితోపాటు ముఠా సభ్యులుగా ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. గుల్బర్గా నుంచి 20 కుటుంబాలను ఉద్యోగం పేరుతో ఇక్కడికి తీసుకొచ్చాడు అనిల్ పవర్. 20 మంది కుటుంబాల్లో చిన్నపిల్లల సైతం ఈ బెగ్గింగ్ మాఫియాలోకి దించాడు. ప్రతి సోమవారం పారడైజ్ సిగ్నల్ దగ్గర బిచ్చం అడుక్కోవడం వీరి పని. అయితే చిన్న పిల్లలను...

Hyderabad: పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు.. హైదరాబాద్‌లో బిచ్చగాళ్ల సామ్రాజ్యం..
Begging Mafia
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Narender Vaitla

Updated on: Aug 21, 2023 | 6:29 PM

హైదరాబాదులో ఎక్కడ ఏ సిగ్నల్ చూసిన సరే ముందుగా మనకు కనిపించేది బిచ్చగాళ్ళ ముఠా. కొంతమంది బిచ్చగాళ్ళు చిన్న పిల్లలను వేసుకొని మరి రోడ్డు మీద ఆడ్డుక్కుoటుంటారు… ఇటీవల వరుసగా బిగ్గిoగ్ మాఫియా లపై హైదరాబాద్ పోలీసులు వరుస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే పోలీసుల విచారణలో కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్లో అడుక్కుంటున్న చాలా ముఠాలు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువ మంది గుల్బర్గా ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు.

గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్ పవర్ అనే వ్యక్తిని పోలీసులు కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేశారు. బెగ్గింగ్ రాకెట్‌కు అనిల్ పవర్ కీలక సుత్రదరుడిగా ఉన్నాడు.. ఇతడితోపాటు ముఠా సభ్యులుగా ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసుల వేట కొనసాగుతుంది. గుల్బర్గా నుంచి 20 కుటుంబాలను ఉద్యోగం పేరుతో ఇక్కడికి తీసుకొచ్చాడు అనిల్ పవర్. 20 మంది కుటుంబాల్లో చిన్నపిల్లల సైతం ఈ బెగ్గింగ్ మాఫియాలోకి దించాడు. ప్రతి సోమవారం పారడైజ్ సిగ్నల్ దగ్గర బిచ్చం అడుక్కోవడం వీరి పని. అయితే చిన్న పిల్లలను కలిగి ఉన్న మహిళలకు అడుక్కునే విషయంలో ప్రత్యేక శిక్షణ ఇస్తూ వచ్చాడు. మహిళల గుడిలో ఉన్న పిల్లలను చూసి చాలామంది ప్రజలు కరిగిపోయి కొంత డబ్బులు ఇస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న బెగ్గిoగ్ మాఫియా నిర్వాహకులు చిన్నపిల్లలు ఎప్పుడు పడుకునే ఉండేలా ప్లాన్ చేశారు.

చిన్నారులకు గంజాయి సప్లై చేస్తున్న బెగ్గింగ్ మాఫియా..

చిన్నారులు అలా పడుకునే ఉండేలా చిన్నపిల్లలకు మత్తు ఎక్కిస్తున్నారు నిర్వాహకులు. దీంతో డోసేజ్‌కు నుంచి మాతో ఇవ్వటంతో ఆ చిన్నారి లేవకుండా అలానే నిద్రపోతుంటాడు. ఇలా పడుకున్న చిన్నారిని ఒక మహిళ చేతిలో పెట్టి ఎలా బిచ్చం అడగాలో ట్రైన్ చేస్తారు. అలా మనుషుల ఎమోషన్స్‌తో ఆడుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు బెగ్గింగ్ మాఫియా సభ్యులు. రోజుకి నిర్వహకులకు 6వేల నుంచి 8వేల రూపాయలు కలెక్షన్ వస్తే అందులో బెగ్గింగ్ చేస్తున్న వారికి కేవలం 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు నిర్వాహకులు. గుల్బర్గా నుండి తీసుకొచ్చిన 20 కుటుంబాలను 20 టీములుగా విభజించి ఓల్డ్ సిటీ నుండి హైటెక్ సిటీ వరకు ఉన్న వివిధ జంక్షన్ ల వద్ద వీరితో బిచ్చం ఎత్తుకునేలా చేస్తున్నారు. జువైనల్ యాక్ట్ సెక్షన్ 76, 77 తో పాటు తెలంగాణ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ సెక్షన్ 27, 28 ప్రకారం వీరిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..