తెలంగాణపై కేంద్ర మంత్రి ప్రశంసలు.. కరోనా నియంత్రణ చర్యలు భేష్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి హర్షవర్దన్ ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. తీసుకుంటున్న చర్యలపై కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హర్షవర్ధన్ అభినందించారు. కరోనా వైరస్‌పై రివ్యూ మీటింగ్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, యోగితా రాణా పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రభలకుండా.. ముందస్తు నియంత్రణపై పలు సూచనలు చేశారు. […]

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి హర్షవర్దన్ ప్రశంసలు కురిపించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. తీసుకుంటున్న చర్యలపై కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హర్షవర్ధన్ అభినందించారు. కరోనా వైరస్‌పై రివ్యూ మీటింగ్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, యోగితా రాణా పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రభలకుండా.. ముందస్తు నియంత్రణపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా.. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రణాళిక చర్యలను.. కేంద్రమంత్రి కొనియాడారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరించాలని సూచించారు. కాగా.. కేంద్రమంత్రి హర్షవర్దన్‌తో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి ఎన్-95 మాస్క్‌లను అందించాలని.. అంతేకాకుండా రాష్ట్రంలో మరో కరోనా ల్యాబ్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు.



