మహిళా కండక్టర్‌పై దాడి చేసిన కానిస్టేబుళ్లు సస్పెండ్..
డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్‌ను దూషించడంతో పాటు దాడికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను హైదరాబాద్ సీపీ అంజని కుమార్ సస్పెండ్ చేశారు. చేయి చేసుకోవడంతో కండక్టర్ ముఖంపై గాయమైంది. దీంతో వెంటనే ఆమె దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. డిపార్ట్‌మెంట్ పరువుకు సంబంధించిన వ్యవహారం కావడంతో సీపీ వారిపై తక్షణమే వేటు వేశారు. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు ఇప్పటివరకు అంబర్ పేట ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే: గురవారం రోజున […]
డ్యూటీలో ఉన్న మహిళా కండక్టర్‌ను దూషించడంతో పాటు దాడికి పాల్పడిన ఇద్దరు కానిస్టేబుళ్లను హైదరాబాద్ సీపీ అంజని కుమార్ సస్పెండ్ చేశారు. చేయి చేసుకోవడంతో కండక్టర్ ముఖంపై గాయమైంది. దీంతో వెంటనే ఆమె దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. డిపార్ట్‌మెంట్ పరువుకు సంబంధించిన వ్యవహారం కావడంతో సీపీ వారిపై తక్షణమే వేటు వేశారు. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు ఇప్పటివరకు అంబర్ పేట ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే:
గురవారం రోజున కానిస్టేబుళ్లు సత్యనారాయణ రెడ్డి, రామకృష్ణా గౌడ్‌లు..చర్లపల్లి జైలు నుంచి ఒక ఖైదీని తీసుకెళ్లి జడ్చర్ల కోర్టులో హాజరుపరిచారు. తిరిగి వచ్చేటప్పుడు వారు కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆ బస్సులో శ్రీలత అనే మహిళ కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కానిస్టేబుళ్లను టికెట్లు తీసుకోమని కోరింది. వారు వారెంట్ ఉందని చెప్పారు. చూపించమని అడగ్గా, అందుకు నిరాకరించారు. ఈ క్రమంలో కండక్టర్, కానిస్టేబుల్ రామకృష్ణాగౌడ్‌ల మధ్య ఘర్షణ చెలరేగి..భౌతిక దాడి వరకు దారితీసింది. దీనిపై జడ్చర్య పీఎస్‌లో కేసు నమోదవ్వడంతో..సీపీ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి : హైపర్ ఆది నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు..?