ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి మరో షాక్ తగిలింది. నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం కేసు నమోదైంది. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న అక్బరుద్దీన్.. విద్వేష ప్రసంగాలు చేస్తూ.. ఓ వర్గాన్ని రెచ్చగొట్టినట్లు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్పందించిన నాంపల్లి కోర్ట్.. ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్‌పై కేసు న‌మోదు చేయాల‌ంటూ.. సైదాబాద్ పోలీసులను గురువారం ఆదేశించింది. […]

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై కేసు నమోదు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 22, 2019 | 9:43 PM

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి మరో షాక్ తగిలింది. నగరంలోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం కేసు నమోదైంది. ఇటీవల కరీంనగర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొన్న అక్బరుద్దీన్.. విద్వేష ప్రసంగాలు చేస్తూ.. ఓ వర్గాన్ని రెచ్చగొట్టినట్లు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేయాలని ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో స్పందించిన నాంపల్లి కోర్ట్.. ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్‌పై కేసు న‌మోదు చేయాల‌ంటూ.. సైదాబాద్ పోలీసులను గురువారం ఆదేశించింది. అక్బరుద్దీన్‌పై ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 153బీ,506 కింద కేసు నమోదు చేయాలని పేర్కొంది. దీంతో కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు ఆయనపై శుక్రవారం కేసు నమోదు చేశారు. సీఆర్పీసీ కింద విచార‌ణ జ‌రిపి డిసెంబ‌ర్ 23న జ‌రిగే త‌దుప‌రి విచార‌ణ‌లోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోర్టు ఆదేశించింది. కాగా, గతంలో కూడా అక్బరుద్దీన్ ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేశారు.