కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇక రథసారిధిగా..

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పదిహేను రోజుల్లో పీసీసీ చీఫ్‌ మార్పులు జరుగబోతున్నాయన్నారు. మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీపీసీసీకి నూతన రథసారథి రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు.. పీసీసీ రేసులో అందరికంటే తానే ముందున్నానన్నారు. ఇక త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టీపీసీసీ పదవి నుంచి వైదొలగనున్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు కూడా తనకే ఇస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర […]

కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఇక రథసారిధిగా..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 22, 2019 | 8:53 PM

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో వారం పదిహేను రోజుల్లో పీసీసీ చీఫ్‌ మార్పులు జరుగబోతున్నాయన్నారు. మహరాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీపీసీసీకి నూతన రథసారథి రాబోతున్నట్లు తెలిపారు. అంతేకాదు.. పీసీసీ రేసులో అందరికంటే తానే ముందున్నానన్నారు. ఇక త్వరలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టీపీసీసీ పదవి నుంచి వైదొలగనున్నారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు కూడా తనకే ఇస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నానని.. ఇందుకోసం అధిష్టానం అనుమతి కూడా కోరానన్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఈ పాదయాత్ర ప్రారంభిస్తానన్నారు.

ఇక ఇదిలా ఉంటే.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఇటీవల తన మనసులో ఉన్న మాటను తెలిపారు. తాను కూడా టీపీసీసీ రేసులో ఉన్నానన్నారు. తనకు టీపీసీసీగా అవకాశమిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అంతేకాదు.. ప్రజా క్షేత్రంలో సమస్యలపై పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. జగ్గారెడ్డితో పాటు.. మరికొందరు కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలిసింది.

కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలతో అధిష్టానం కూడా వెంకట్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ అధికారంలోకి రాదంటూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా.. తమకు పీసీసీ పగ్గాలు ఇస్తే.. పార్టీ సజీవంగా బతకడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తామని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగానే.. బీజేపీకే భవిష్యత్తు ఉందని.. త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత మళ్లీ యూటర్న్ తీసుకుని.. కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయ్యారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఆడిన ఈ గేమ్ అంతా అన్నకు పీసీసీ పదవి కోసమేనేమో అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!