AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేయాల్సిందే.. అభ్యర్థుల డిమాండ్‌ ఏంటంటే.

తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ ఇప్పుడు అభ్యర్థులు కోరుతున్నారు. ఆగస్టు నెలలో గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నందున రెండు పరీక్షలకు ఒకేసారి ప్రిపేర్ కాలేకపోతున్నామని మూడు నెలలు గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు...

Telangana: గ్రూప్‌ 2 పరీక్షను వాయిదా వేయాల్సిందే.. అభ్యర్థుల డిమాండ్‌ ఏంటంటే.
Tspsc Group 2
Vidyasagar Gunti
| Edited By: Narender Vaitla|

Updated on: Jul 24, 2023 | 4:45 PM

Share

తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ ఇప్పుడు అభ్యర్థులు కోరుతున్నారు. ఆగస్టు నెలలో గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నందున రెండు పరీక్షలకు ఒకేసారి ప్రిపేర్ కాలేకపోతున్నామని మూడు నెలలు గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు విన్నవిస్తున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి 200 మంది అభ్యర్థులు చేరుకొని వినతి పత్రాన్ని అందజేశారు. ఆగస్టు ఒకటి నుంచి 20వ తేదీ వరకు గురుకుల పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలు ప్రకటించారు . గురుకులాల సిలబస్, గ్రూప్-2 సిలబస్ వేరువేరుగా ఉన్నందున ఒకే అభ్యర్థి రెండు పరీక్షల సిలబస్ను కవర్ చేయడం ఇబ్బందిగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో గురుకుల పరీక్షలు ముగిసిన తర్వాత రెండు నెలల కు గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు.

దానితోపాటు గ్రూప్ 2 మూడవ పేపర్ ఎకానమీ లో గత సిలబస్ కు 70% అదనంగా చేర్చారని.. ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో మానసికంగా కృంగిపోయి మూడు నెలలు చదవలేకపోయామని అభ్యర్థులు చెబుతున్నారు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మూడు నెలలపాటు గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేయాలంటూ TSPSC నీ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటు గురుకుల.. అటు గ్రూప్-2 ఈ రెండు పరీక్షలకు అర్హతలు ఉన్నా ఒకే నెలలో నిర్వహించడం వల్ల ఏదో ఒక దాంట్లో తాము అవకాశం కోల్పోయే పరిస్థితి ఉందని.. వాయిదా వేసి తీరాలని కోరుతున్నారు.

టీఎస్పీఎస్సీ గత ఏడాది 783 పోస్టులకు గాను గ్రూప్ 2 నోటిఫికేషన్ వెలువడించింది. ఈ పోస్టులకు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సుమారు 705 మంది అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా సెంటర్లకు సంబంధించిన పాఠశాలలకు సెలవులు కూడా అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు గ్రూప్-2 వాయిదా వేయాలన్న డిమాండ్పై టీఎస్పీఎస్సీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?