Mahabubabad News: ఇలా కట్టారు.. అలా కుప్పకూలిపోయింది.. మహబూబాబాద్‌లో దారుణం.. గ్రామస్తుల ఆగ్రహం..
Mahabubabad News: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామాల్లో వైకుంటాదామాల నిర్మాణాలలో నాణ్యత నగుబాటుగా మారింది. వైకుంఠదామ..
Mahabubabad News: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామాల్లో వైకుంటాదామాల నిర్మాణాలలో నాణ్యత నగుబాటుగా మారింది. వైకుంఠదామ విశ్రాంతి గది నిర్మాణ దశలో స్లాబ్ పోసిన మరుసటి రోజే కుప్ప కూలిపోయింది. దాంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో ఉపయోగించిన ఇసుక, సిమెంట్, ఇనుము ఇలా ప్రతి దానిలో నాణ్యతా ప్రమాణాలు మచ్చుకైనా కన్పిచడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకెళితే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రేకుల తండా గ్రామంలో వైకుంఠదామ విశ్రాంతి గది నిర్మాణం చేపట్టారు. అయితే ఆ గదికి స్లాబ్ పోసిన మరుసటి రోజేకుప్పకూలిపోయింది. దాంతో పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. శాఖల మధ్య సమన్వయలోపం, అధికారుల నిర్లక్ష్యం.. వెరసి ప్రజాధనం నీళ్ల పాలవుతోంది. ఉపాధి హామీ పథకం నిధులతో రూ. 13 లక్షల 50 వేల వ్యయంతో గ్రామాల్లో వైకుంఠదామం నిర్మాణానికి ప్రభుత్వం పూనుకున్న విషయం తెలిసిందే.
అయితే నిధులు సరిపోవడంలేదని, స్థలాల కొరత పేరిట ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువ సమీపంలోనే బండ రాళ్లు.. లోయల మధ్య నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణం వల్ల వర్షం నీరు లోయలోకి చేరి నిండుకుంటే అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చిన స్థానికులు లోయలో జారీ పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్ష లేకపోవడం వల్లే కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్చేస్తున్నారు. కూలిపోయిన వైకుంఠదామం నిర్మాణ పనులను పునఃప్రారంభించి త్వరలోనే వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
Also read:
Juttada murders: విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు