- Telugu News Photo Gallery Science photos Nasa shares stunning images of earth over becoming earth day
NASA: వావ్.. భూమి ఇంత అందంగా ఉంటుందా?!.. ప్రపంచాన్నే అబ్బురపరిచే ఫోటోలను షేర్ చేసిన నాసా.. మీరూ చూసేయండి..
NASA: వావ్.. భూమి ఇంత అందంగా ఉంటుందా?!.. ప్రపంచాన్నే అబ్బురపరిచే ఫోటోలను షేర్ చేసిన నాసా.. మీరూ చూసేయండి..
Updated on: Apr 17, 2021 | 12:01 PM

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా(నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) గురువారం అద్భుతమైన పిక్స్‌ని షేర్ చేసింది.

అంతరిక్షంలోని స్పేస్ సెంటర్ నుంచి భూమిని ఫోటోలు తీసి నాసా కేంద్రానికి పంపగా.. నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అంతరిక్షం నుంచి తీసిని భూమి ఫోటోలు నెటిజన్లను మెస్మరైజ్ చేస్తున్నాయి.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వేంటేజ్ పాయింట్ నుంచి భూమికి సంబంధించి ప్రకృతి దృశ్యాలను బందించారు.

భూమికి సంబంధించి నీరు, గాలి, ఐస్ ఫోటోలే అయినప్పటికీ.. చూడటానికి ఎంతో అద్భుతంగా.. మెస్మరైజ్ చేస్తున్నాయి.

ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నాసా.. ‘‘మనం భూమి మీద ఉన్నామా? అంతరిక్షంలో ఉన్నామా? అనేది పాయింట్ కాదు. మనమంతా ఈ చిన్న నీలి గ్రహం ద్వారా ఏకీకృతం అవడం విశేషం. దీనిని మనమంతా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశం.’ అని క్యాప్షన్ పెట్టింది.

‘ఎర్త్ డే’ ని పురస్కరించుకుని ఏప్రిల్ 21 నుంచి 24 వ తేదీ వరకు ‘కనెక్టెడ్ బై ఎర్త్’ కార్యక్రమానికి నాసా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాన్ని నాసా చేపడుతోంది.




