AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ఎమ్మెల్యేకు అస్సలు టిక్కెట్ ఇవ్వొద్దు.. కేటీఆర్ దగ్గరకు చేరిన పంచాయతీ.. ఏం తేల్చేనో మరి..!

ఎమ్మెల్యే వైఖరిని ఎండగడుతూ గత కొంతకాలంగా బాహాటంగానే విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రల పేరిట బీఆర్ఎస్‌కు అనుకూలంగా, సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా విభిన్న కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. స్థానికంగా పార్టీలో కల్లోలాన్ని సృష్టిస్తున్న ఆ ఐదుగురు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఈ నెల 6వ తేదీన ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Telangana: ఆ ఎమ్మెల్యేకు అస్సలు టిక్కెట్ ఇవ్వొద్దు.. కేటీఆర్ దగ్గరకు చేరిన పంచాయతీ.. ఏం తేల్చేనో మరి..!
Brs Party Mla
G Sampath Kumar
| Edited By: |

Updated on: Aug 04, 2023 | 11:36 AM

Share

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రామగుండంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. వివిధ పార్టీల నుండి టికెట్లు ఆశిస్తున్న వారు అధిష్టానం ఆశీర్వాదం కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇక్కడి బీఆర్ఎస్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి అధికార పార్టీ నేతల మధ్య టికెట్ల పందెరం తీవ్ర దుమారాన్నిరేపుతోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుండి టికెట్‌ను‌ ఆశిస్తున్న నేతలు.. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు టికెట్ ఇవ్వద్దని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సభను ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా ఇదివరకే.. పాదయాత్ర నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు.. చందర్‌కు కాకుండా ఎవరికీ టికెట్ ఇచ్చిన ఓకే అంటున్నారు. కందుల సంధ్యారాణి, మిరియాల రాజిరెడ్డి, పాతిపెల్లి ఎల్లయ్య యాదవ్, కొంకటి లక్ష్మీనారాయణ, బయ్యపు మనోహర్ రెడ్డి లు స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడ్డారు. ఎమ్మెల్యే వైఖరిని ఎండగడుతూ గత కొంతకాలంగా బాహాటంగానే విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రల పేరిట బీఆర్ఎస్‌కు అనుకూలంగా, సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా విభిన్న కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. స్థానికంగా పార్టీలో కల్లోలాన్ని సృష్టిస్తున్న ఆ ఐదుగురు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఈ నెల 6వ తేదీన ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన చందర్‌కు కాకుండా, తమలో ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా, కలిసికట్టుగా పనిచేసి రామగుండంలో మరోసారి గులాబీ జెండాను ఎగురవేస్తామని మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ప్రకటించారు. స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆశావాహులు పదునైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నా.. జిల్లా అధ్యక్షుని హోదాలో ఉన్న ఇక్కడి ఎమ్మెల్యే చందర్ కానీ, పార్టీ అధిష్టానం గాని ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పార్టీ క్యాడర్‌ను అయోమయంలో పడేస్తోంది. ఆశావాహులనుకుంటున్నట్లు ఈనెల 6 వ తేదీన తిరుగుబాటు నాయకుల ప్రజా ఆశీర్వాద సభ జరిగితే, రామగుండం అధికార పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు రామగుండం విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్న అధిష్టానం అప్రమత్తమయింది. అసమ్మతి నేతలు హైదరాబాద్‌కు రావాలని కేటీఆర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ జిల్లాకు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సమన్వయ బాధ్యతలు అప్పాజెప్పారు. గత 6 నెలల నుంచి అసమ్మతి నేతలు చందర్‌కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఈయన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మౌనంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ అసమ్మతి నేతలు మాత్రం తాడోపేడో తెల్చుకునేందుకు సిద్దమయ్యారు. మరి కేటీఆర్ వీరికి ఎలాంటి ఆదేశాలు ఇస్తారో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..