AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బండి సంజయ్‌పై బీఆర్ఎస్‌ ముఖ్య నేత ఇంట్రస్టింగ్ కామెంట్స్.. సడెన్‌గా ఇంత ప్రేమ ఏలనో..!

అధ్యక్ష పదవి కోల్పోయిన బీజేపీ నాయకుడు బండి సంజయ్‌పై బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ముఖ్య నేత, ఎమ్మెల్యేకు ఎన్నడూ లేని అభిమానం పొంగుకొచ్చింది. అధ్యక్షుడిగా ఉన్నంతకాలం విమర్శల వర్షం కురిపించిన ఆయన.. ఇప్పుడు సడెన్‌గా వాయిస్ ఛేంజ్ చేశారెందుకు? ఆయనను తొలగించడం అన్యాయం అంటూ సదరు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు

Telangana: బండి సంజయ్‌పై బీఆర్ఎస్‌ ముఖ్య నేత ఇంట్రస్టింగ్ కామెంట్స్.. సడెన్‌గా ఇంత ప్రేమ ఏలనో..!
Brs Mla And Bandi Sanjay
Sridhar Prasad
| Edited By: Shiva Prajapati|

Updated on: Jul 10, 2023 | 3:15 PM

Share

అధ్యక్ష పదవి కోల్పోయిన బీజేపీ నాయకుడు బండి సంజయ్‌పై బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ముఖ్య నేత, ఎమ్మెల్యేకు ఎన్నడూ లేని అభిమానం పొంగుకొచ్చింది. అధ్యక్షుడిగా ఉన్నంతకాలం విమర్శల వర్షం కురిపించిన ఆయన.. ఇప్పుడు సడెన్‌గా వాయిస్ ఛేంజ్ చేశారెందుకు? ఆయనను తొలగించడం అన్యాయం అంటూ సదరు ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి బండి సంజయ్‌కు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తున్న ఆ బీఆర్ఎస్ నేత ఎవరు? ఇప్పుడెందుకు ఆయన అలా కామెంట్స్ చేస్తున్నారు? ఇంట్రస్టింగ్ పొలిటికల్ స్టోరీ మీకోసం..

బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఒక్కసారిగా ప్రేమ పొంగుకొచ్చింది. ఆయన్ను పదవి నుంచి తొలగించడంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. బీసీలకు ఆత్మగౌరవం కావాల్సిందేనని, అది బీజేపీ, కాంగ్రెస్‌లో మచ్చుకైనా దొరకదంటూ సీరియస్‌గా కామెంట్స్ చేశారు. అంతేకాదు.. పనిలోపనిగా బీసీలందరూ కేసీఆర్‌ వైపు వచ్చేయాలంటూ పిలుపునిచ్చారు. ఆయన ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రస్తుతం తెలంగాణలో బీసీ కార్డ్ సెంట్రిక్‌గా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన దానం నాగేందర్.. మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ కూడా బీసీ బిడ్డనే అని గుర్తు చేశారు. ఆ కారణంగానే ఆయన్ను పదవి నుంచి తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని దానం నాగేందర్ అన్నారు. ప్రస్తుంం కాంగ్రెస్ బీసీ నాయకులు చేస్తున్న పోరాటం న్యాయమైనదే అని అన్నారు దానం. ఎన్నికల వరకు బీసీ అది.. బీసీ ఇది అంటూ పొగిడి.. చివరకు ఎన్నికల్లో టికెట్ కేటాయింపు, పదవుల కేటాయింపు వరకు వచ్చే సరికి హ్యాండ్ ఇస్తారని విమర్శించారు. అంతేకాదు.. బీజేపీలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు దానం నాగేందర్. బీసీ బిడ్డ కాబట్టే బండి సంజయ్ కుమార్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారని విమర్శించారు. బీసీని తొలగించి వేరే సామాజిక వర్గానికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారని దుయ్యబట్టారు. మున్నూరు కాపు వర్గం కూడా బండి సంజయ్‌కు అన్యాయం జరిగిందంటూ తనకు ఫోన్ కాల్స్ చేస్తున్నారని తెలిపారు దానం.

ఇవి కూడా చదవండి

బీసీలను బీఆర్ఎస్‌ వైపు లాగే ప్రయత్నం..

అయితే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో బీసీలకు న్యాయం జరుగదని, బీసీలంతా బీఆర్ఎస్ వైపు రావాలంటూ పిలుపునిచ్చారు దానం నాగేందర్. ఇప్పటికైనా ఇతర పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కళ్లు తెరిచి కేసీఆర్ వైపు చూడాలన్నారు. బీసీలకు ఆత్మ గౌరవం ముఖ్యం అని, అది జాతీయ పార్టీలో లేదని అన్నారు. అన్ని కులాలకు న్యాయం చేస్తున్న కేసీఆర్ వైపు బీసీలు రావాలని పిలుపునిచ్చారు దానం నాగేందర్.

మొత్తంగా, ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా బీసీ కార్డ్‌తో తనదైన మార్క్ పాలిటిక్స్ నడిపే ప్లాన్‌‌లో ఉన్నట్లు తాజాగా కామెంట్స్ చెబుతున్నాయని పొలిటికల్ పండితులు అభిప్రాయపడుతున్నారు. బీసీలను బీఆర్ఎస్ వైపు లాగేందుకు ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. మరి ఆయన అంతరంగం ఏంటనేది ముందు ముందు తెలియనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..