AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దేవా.. ఇదేనా నీ ఆట.. దాగుడుమూతలు ఆడుతూ పత్తిలో దాక్కున్న బాలుడు… ఊపిరాడక

దాగుడు మూతల ఆట ప్రాణం తీసింది. పత్తిలో దాక్కుని ఊపిరాడక బాలుడు మృతి చెందాడు.

Telangana: దేవా.. ఇదేనా నీ ఆట.. దాగుడుమూతలు ఆడుతూ పత్తిలో దాక్కున్న బాలుడు... ఊపిరాడక
Cotton
Ram Naramaneni
|

Updated on: Jan 04, 2023 | 8:52 AM

Share

ఊహించని విషాదం ఇది. మాటలకందని ఘోరం. సరదాగా ఆడిన ఆటే అతడిని బలి తీసుకుంది. దాగుడు మూతల ఆట ఓ చిన్నోడి ఊపిరి తీసింది. గేమ్‌లో భాగంగా పత్తిలో‌ దాక్కున్న బాలుడు ఊపిరాడక మృతిచెందాడు. కొమురంభీం జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. మృతుడిని నాలుగవ తరగతి చదువుతున్న అభిషేక్ ( 12 )గా గుర్తించారు. తల్లిదండ్రులు కూరగాయలు అమ్మడానికి వారాంతపు సంతకు వెళ్లారు. చెల్లితో కలిసి దాగుడు మూతల ఆట ఆడాడు అన్నయ్య అభిషేక్. ఈ క్రమంలోనే పత్తిలో దాక్కుని.. ఊపిరందక మృతిచెందాడు. పని ముగించుకుని.. తిరిగి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు తలకిందులుగా కుమారుడు పత్తిలో కనిపించడంతో షాక్ తిన్నారు. వెంటనే అప్రమత్తమై స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అభిషేక్ మృతి చెందినట్టు తెలిపారు వైద్యులు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆక్రందనలు మిన్నంటాయి. ఈ ఘటనపై ఎవరిని నిందించాలి.. విధిని ఆడించే ఆ దేవుడని తప్ప.

Boy

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..