Telangana: అర్ధరాత్రి మేకపోతుతో స్కూల్‌లో ఇద్దరు వ్యక్తులు.. అనుమానంతో ఆరా తీయగా.. పెద్ద కథే
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నిత్యం వందల మంది తిరిగే నడి బొడ్డున ప్రధాన రహదారి ఆనుకోని ఉన్న ఓ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం రేపాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.? ఓ సారి లుక్కేయండి

కుసుమ రామయ్య జిల్లా పరిషత్ (బాలురు) ఉన్నత పాఠశాల లోపలి ప్రహరీ గోడ పక్కన మేక పిల్లను బలివ్వడానికి సిబ్బంది యత్నించారు. వేకువ జామున 4.30 గంటల సమయంలో పాఠశాలలో పనిచేసే రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశం. స్కూల్ గేటు తాళం తీశాడు. అక్కడ ఉన్న కొందరు ఏమో జరుగుతుందోనని స్థానికులు గమనించారు. లోనికి వెళ్లి పరిశీలించి చూడగా పాఠశాల ఆవరణలో క్షుద్ర పూజకు ఏర్పాట్లు చేసినట్లు అక్కడ ఆనవాళ్లు గుర్తించారు. గేటు లోపల అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మేక పిల్లను కడిగి ముఖాన బొట్టుపెట్టి ఒకరు మేక కాలు పట్టుకొని ఇంకో అతను కత్తితో కోయడానికి సిద్ధం అవ్వగా.. అక్కడే ఉన్న స్థానికులు ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించగా అక్కడి నుండి మేకను తీసుకొని వాళ్ళు తెచ్చుకున్న బండిపై వెళ్ళిపోయారు.
అక్కడే ఉన్న రికార్డు అసిస్టెంట్‌ను ప్రశ్నించగా వాస్తు బాగాలేదని అందుకే మేకను బలిస్తున్నారని తెలిపారు. అక్కడ ఉన్న కొందరు అక్కడ జరిగిందంతా తమ చరవాణిలో వీడియోలు, ఫోటోలు తీశారు. వెంటనే డీఈఓకి సమాచారం ఇచ్చారు. డీఈఓ ఆదేశాల మేరకు పాఠశాలకు వచ్చిన ఎంఈఓ దూస రఘుపతి.. సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కూల్ ఆవరణలో క్షుద్ర పూజలకు పాల్పడేందుకు ప్రయత్నించిన వారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే, పాఠశాలలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడంతో సిరిసిల్ల విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. స్కూల్ సిబ్బందే మూఢనమ్మకాలను ప్రోత్సహించడమేంటని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..