Telangana: నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేవైఎం కార్యకర్తల రాస్తారోకో.. జూబ్లీహిల్స్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా..

Telangana: హైదరాబాద్‌ (Hyderabad) జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలిక కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలికపై జరిగిన అత్యాచార ఘనటలో అధికారిక పార్టీతో పాటు, ఎంఐఎం నాయకుల...

Telangana: నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేవైఎం కార్యకర్తల రాస్తారోకో.. జూబ్లీహిల్స్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 06, 2022 | 6:43 AM

Telangana: హైదరాబాద్‌ (Hyderabad) జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలిక కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలికపై జరిగిన అత్యాచార ఘనటలో అధికారిక పార్టీతో పాటు, ఎంఐఎం నాయకుల కుమారులు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. దీంతో టీఆర్‌ఎస్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ కావాలనే నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌ మైనర్‌ బాలిక కేసును సీబీఐతో విచారించాలనే డిమాండ్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలో మహిళలపై, అమ్మాయిలపై వరుసగా జరుగుతున్నఅఘాయిత్యాలు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని, టీఆర్‌ఎస్‌ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌ మాట్లాడుతూ.. ‘పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరు మహిళలు, అమ్మాయిల భద్రత విషయంపై ఆందోళన కలిగిస్తోంది’అని ఆరోపించారు. మరి బీజేవైఎం చేపట్టిన ఈ కార్యక్రమం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే