AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharmapuri Arvind: పసుపు బోర్డు అభివృద్దిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు..

నిజామాబాద్‎లో పసుపు బోర్డుకు సంబంధించి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించి నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటి వేసి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ వెల్లడించారు. జనవరి 29 సోమవారం మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

Dharmapuri Arvind: పసుపు బోర్డు అభివృద్దిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు..
Bjp Mp Dharmapuri Arvind
Srikar T
|

Updated on: Jan 29, 2024 | 9:30 PM

Share

నిజామాబాద్‎లో పసుపు బోర్డుకు సంబంధించి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సీజన్‌లో జాతీయ పసుపు బోర్డు పని ప్రారంభిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించి నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక కమిటి వేసి కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని బీజేపీ ఎంపీ వెల్లడించారు. జనవరి 29 సోమవారం మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. పసుపు ఎగుమతులను పెంచేందుకు మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు వెచ్చించాలని కోరారు. ఫంగస్ వంటి వ్యాధుల నుంచి పసుపును కాపాడుకునేందుకు క్రిమిసంహారక మందులను వినియోగించి సేంద్రియ పద్ధతుల్లో పంటను సాగు చేయాలని రైతులకు సలహా ఇచ్చారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. పంటలకు బీమా కల్పించేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎఫ్‌బీవై) అమలు చేయాలని ఆకాంక్షించారు. ఇంకా, పసుపు ధరలు మార్కెట్‌లో పడిపోయినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ పసుపు బోర్డు గత సంవత్సరం అక్టోబర్‌లో స్థాపించబడింది. ప్రధానంగా “పసుపు సంబంధిత విషయాలలో రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి, వారి ప్రయత్నాలను కాపాడటానికి దీనిని ఏర్పాటు చేశారు. అలాగే పసుపు రంగం అభివృద్ధి కోసం సుగంధ ద్రవ్యాల బోర్డుతో సమన్వయం చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇలా చేయడం ద్వారా ఎగుమతుల విలువ ప్రస్తుతం రూ.1,600 కోట్లు కాగా, 2030 నాటికి రూ.8,300 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..