AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది బీజేపీ నే.. ఈటల రాజేందర్ కామెంట్

కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ జమ్మికుంట మండల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్.. నాయకుడు ఎప్పుడు...

Telangana: కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది బీజేపీ నే.. ఈటల రాజేందర్ కామెంట్
Bjp Mla Eatala Rajender
Ganesh Mudavath
|

Updated on: May 29, 2022 | 8:27 PM

Share

కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పార్టీ జమ్మికుంట మండల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటల రాజేందర్.. నాయకుడు ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉండాలని పిలుపునిచ్చారు. అలాంటి వారికే పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పారు. సర్వే చేసి ప్రజా బలం ఉన్నవారికే టికెట్లు ఇస్తారని తెలిపారు. ఎంత కాలం పని చేశామనేది ముఖ్యం కాదన్న ఈటల.. ప్రజామోదం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజలే దేవుళ్లు అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని చెప్పారు. గెలిచాం కదా అని ప్రజలను, కార్యకర్తలను మర్చిపోతే మళ్లీ గెలవలేరని వివరించారు.

మన క్షేత్రం గ్రామాలు. నేలవిడిచి సాము చేయవద్దు. ఆ పూటకు ఓట్లు అడిగితే ప్రజలు ఓట్లు వెయ్యరు. పదవి మార్కెట్లో దొరికేది కాదు. అమ్మ నాన్న ఇచ్చేది కాదు. కొనుక్కుంటే వచ్చేది అంత కన్నా కాదు. అది ప్రజలు ఇచ్చేది. ప్రజల్లో ఉందాం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను ఎండగడదాం. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలిచేది బీజేపీ నే.

         – ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి