Vijayashanthi: ఈటెల vs రేవంత్ వివాదంపై స్పందించిన విజయశాంతి
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమకు ఎవరూ డబ్బులివ్వలేందంటూ స్పష్టం చేశారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలే చందాలు వేసుకున్నారని తెలిపారు. ఈటల చేసిన ఆరోపణలు నిరూపించేందుకు శనివారం భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమా అంటూ రేవంత్ సవాలు చేశారు.
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకీ సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమకు ఎవరూ డబ్బులివ్వలేందంటూ స్పష్టం చేశారు. ఎన్నికల కోసం కాంగ్రెస్ కార్యకర్తలే చందాలు వేసుకున్నారని తెలిపారు. ఈటల చేసిన ఆరోపణలు నిరూపించేందుకు శనివారం భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద తడిబట్టలతో ప్రమాణానికి సిద్ధమా అంటూ రేవంత్ సవాలు చేశారు. అయితే రేవంత్ సవాలుపై ఇంతవరకు ఈటల రాజేంధర్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి తాజాగా ఈ విషయంపై స్పందించారు. రాష్ట్ర పాలనపై పోరాడేవారు ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం సరికాదన్నారు.
దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతోందని.. రాష్ట్ర రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమిది అని పేర్కొన్నారు . ఇందుకు కారణమైన అసలైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడాల్సిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉందన్నారు. ఈ విధానాన్ని అధికారపార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక, ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటలు, సవాళ్ల దాడులు, బీఆర్ఎస్‌కు వేడుకలవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ తో పోరాడే తమ్ముళ్లు రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఒకరిపై ఒకరు దాడులు చేసకోకుండా ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాటం చేయడం అవసరమని నొక్కి చెప్పారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో నా బాధ్యత అనిపించిందంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..