Telangana: చేసిన పాపాలు పండుతున్నాయి.. బయటకు రావాల్సింది చాలా ఉంది.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ లీడర్, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. చేసిన పాపాలు పండుతున్నాయని టీవీ9 కు ఇచ్చిన బైట్ లో చెప్పారు. కవిత పాత్ర ఉందా లేదా అనేది ఏజెన్సీలు చెబుతాయన్నారు. ఎవరనీ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ లీడర్, మాజీ ఎంపీ విజయశాంతి స్పందించారు. చేసిన పాపాలు పండుతున్నాయని టీవీ9 కు ఇచ్చిన బైట్ లో చెప్పారు. కవిత పాత్ర ఉందా లేదా అనేది ఏజెన్సీలు చెబుతాయన్నారు. ఎవరనీ టార్గెట్ చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని వివరించారు. ఈడీ, సీబీఐ చేసింది చాలా తక్కువ అన్న విజయశాంతి.. ఇంకా బయటకు రావాల్సింది చాలా ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎన్నికల వ్యూహం ఏమిటో త్వరలోనే చెబతామన్నారు. ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తాము ఏమీ చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాగా దేశవ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత పేరు రావడం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు కలిగించింది. ఓ వైపు అరెస్ట్‌లు కొనసాగుతున్న వేళ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు మరో మలుపు తిరిగింది. రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈడీ రిపోర్టులో చేర్చింది.
కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో తన పేరు ఉండటంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చారని విమర్శించారు. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో ఎన్నికలున్నాయని.. అందుకే మోదీ వచ్చే ముందు ఈడీ ఇక్కడికి వచ్చిందన్నారు. తాను ఎలాంటి విచారణ ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాని స్పష్టం చేశారు. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం ఇస్తానని వివరించారు.
మరోవైపు.. కవిత ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ కానున్న విషయం హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ స్కామ్ గురించి ఏమైనా చర్చిస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ఈ భేటీ ఏ పరిస్థితికి దారి తీస్తుందో.. లిక్కర్ స్కామ్ ఎన్ని మలుపులు తిరుగుతుందో..




మరిన్ని తెలగాణ వార్తల కోసం