AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కూల్ వెదర్‌లోనూ చిల్డ్ బీరే కావాలంటున్న తెలంగాణ మందుబాబులు.. ఎందుకో తెల్సా..?

కూల్ వెదర్‌లోనూ మాకు చిల్డ్ బీరే కావాలని అంటున్నారు తెలంగాణ మందుబాబులు. దీనికి రీజన్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telangana: కూల్ వెదర్‌లోనూ చిల్డ్ బీరే కావాలంటున్న తెలంగాణ మందుబాబులు.. ఎందుకో తెల్సా..?
Beer
Ram Naramaneni
|

Updated on: Dec 03, 2022 | 10:11 AM

Share

ప్రజంట్ వింటర్ సీజన్ నడుస్తుంది. చలి అల్లాడిస్తుంది. పొగమంచు అయితే ఇంకా పెద్దగా స్టార్ట్ అవ్వలేదు కానీ.. చలి మాత్రం బానే ఉంది. అయినప్పటికీ.. విచిత్రంగా తెలంగాణ మందుబాబులు బీర్ పైనే మక్కువ చూపుతున్నారు. గడ్డకట్టే చలిలోనూ చిల్డ్ బీర్ కావాలని కోరుకుంటున్నారు. దీనికి కారణం పెరిగిన ధరలే. అందుకే షాపుకు వెళ్లి మాకు హార్డ్ వద్దు బాబు.. బీర్ ఇచ్చేయండి చాలు అంటున్నారు. దీంతో సేల్స్ అమాంతం పెరిగాయి. గతానికి భిన్నంగా ఉష్ణోగ్రతలు తగ్గినా బీయర్ సేల్స్ ఫుల్ జోష్‌లో ఉన్నాయి. నవంబర్ నెలలో 24 లక్షల లిక్కర్ కేసులు అమ్ముడవ్వగా,  బీర్ మాత్రం 28 లక్షల కేసులు అమ్ముడయ్యింది. యూత్ అంతా బీర్ల వైపే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు వైన్ షాప్ యజమానులు.

తెలంగాణలో మొదట్నుంచి లిక్కర్ సేల్స్ ఎక్కువే. ఇక ఏదైనా పండుగలు ఉన్నా, బోనాలు అయినా సరే సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. దేశంలో అత్యధికంగా లిక్కర్ తాగువాళ్లు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ సెకండ్ ప్లేసులో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కొత్తగా మందుకు అలవాటు పడుతున్న వారి సంక్య కూడా భారీగా ఉంది. మెట్రో సిటీల్లోనే కాదు.. పట్టణాల్లో కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్యం సేవించేవారి సంఖ్య పెరిగింది.

అందుకే తెలంగాణలో మందు ద్వారా వస్తున్న ఇన్‌కమ్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. ఒక్కో మద్యం షాపు  ఏటా కనీసం పది కోట్ల పైనే బిజినెస్ చేస్తోందని ఓ అంచనా. లిక్కర్ అమ్మకాల ద్వారా ఏడాదికి దాదాపు రూ.18 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అటు నాన్ వెజ్ సేల్స్ కూడా రికార్డ్ రేంజ్‌లో ఉన్నాయి. ఈ లెక్కన మందు, ముక్క విషయంలో తెలంగాణ ప్రజలు తగ్గేదే లే అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..