AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: రేపు పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన.. అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ( ఆదివారం ) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు...

CM KCR: రేపు పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన.. అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు..
CM KCR
Ganesh Mudavath
|

Updated on: Dec 03, 2022 | 8:52 AM

Share

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ( ఆదివారం ) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవంతో పాటు పాత కలెక్టరేట్ స్థానంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఒక్క ఏడాదిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. బస్టాండ్ సమీపంలో నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట కొలువై ప్రజలకు సేవలందించే విధంగా తీర్చిదిద్దిన ఘనత దేశంలో తెలంగాణ కు మాత్రమే సాధ్యమైందని అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణాలు చేపట్టారని, అన్ని పనులు ఒకేచోట పూర్తయ్యే అవకాశం లభిస్తుందని అధికారులు వెల్లడించారు.

కాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహబూబ్‌ నగర్‌లో పర్యటనతో ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రధాన రహదారితో పాటు భూత్పూరు దారిలోని సమీకృత కార్యాలయాల భవన సముదాయం నుంచి సీఎం సభ జరిగే ఎంవీఎస్‌ కాలేజ్, ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కూడలి వరకు వివిధ రకాల పనులు చేపట్టారు. జాతీయ రహదారిని సుందరంగా తీర్చిదిద్ది, రంగు రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. గులాబీ తోరణాలు, ఫ్లెక్సీలతో పట్టణాన్ని గులాబీ మయంగా మార్చారు. మహాత్మా గాంధీ రోడ్డు ఉన్నత పాఠశాల ఎదుట విద్యార్థుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.

అంతే కాకుండా మహబూబ్ నగర్ అనగానే గుర్తుకువచ్చే పిల్లలమర్రి చెట్టును పోలిన మనిషి ఆకారం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంవీఎస్‌ కాలేజ్ నుంచి బీటీ రోడ్డు వేస్తున్నారు. సీఎం రోడ్డు మార్గాన వస్తుండటంతో చాలాకాలంగా పట్టించుకోని సమస్యలపై కూడా దృష్టి సారించారు. దీంతో పాలమూరు కొత్తందాలు సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..