AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేం చిత్రం బాబోయ్.. చేపల కోసం వల వేస్తే ఏం చిక్కిందో తెల్సా..?

అసలే ఆదివారం.. నీసు తినకపోతే ఎలా..? చికెన్ తిందామంటే బర్డ్ ప్లూ భయాలు.. మటన్ తిందామంటే.. రేటు మధ్యతరగతి పరిధిలో లేదు.. ఎలాగూ చేతిలో వల ఉంది కదా.. చేపలు పడదాం అనుకున్నారు ఆ ఊరి యువకులు.. అనుకున్నదే తడువుగా సమీపంలోని వాగు వద్దకు వెళ్లి వల వేశారు. అయితే వలలో చిత్రమైనది ఒకటి చిక్కింది.

Telangana: ఇదేం చిత్రం బాబోయ్.. చేపల కోసం వల వేస్తే ఏం చిక్కిందో తెల్సా..?
Bike In Fish Net
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 08, 2025 | 9:11 AM

వల వేసినప్పడు దండిగా..మంచి చేపలు పడాలని జాలర్లు కోరుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు బ్యాడ్ లక్.. డెవిల్ ఫిష్ వంటివి వలలో చిక్కుతూ ఉంటాయి. మరొకొన్నిసార్లు షాక్‌కు గురిచేసేలా కొండచిలువలు, మొసళ్లు వలలో పడుతూ ఉంటాయి. ఎంతో ఆశతో వలను లాగిన జాలర్లు వాటిని చూసి కంగుతింటూ ఉంటారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరచుగా జరుగుతూనే ఉంటాయి. అయితే వలలో బైక్ చిక్కిడం మీరెప్పుడైనా చూశారా..? అలాంటి ఘటనే జరిగిందండోయ్.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లిన వారికి అలాంటి విచిత్ర అనుభవమే ఎదురయింది.

స్థానిక యువకులు కొందరు ఆదివారం.. మాంచి చేపలు పులుసు తినాలని భావించారు. బయటకు కేజీ 200 నుంచి 500 వరకు అమ్ముతున్నారు. అంత ఖర్చు ఎందుకు… స్థానిక వాగుకు వెళ్లి వల వేద్దాం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా… స్థానిక ఓటి చెరువుకి వచ్చి వాగులో చేపలు కోసం వల వేయగా  ఓ ద్విచక్ర వాహనం చిక్కింది. వాగు మధ్యలో దొరికిన బైకును వారు ఒడ్డుకు తీసుకువచ్చారు. TS04EE3722 గల హీరో గ్లామర్ బైక్‌ని చూసి వారు షాకయ్యారు. ఈ- చలాన్ యాప్ లో నంబర్‌తో చెక్ చేయగా.. ఆ బైక్ పేరం రవీంద్ర రెడ్డి అని ఉంది. ఈ బైకు వాగు మధ్యలోకి ఎలా వచ్చి చేరిందని.. ఎవరైనా గల్లంతయ్యారా..? లేదా ఎవరైనా తీసుకువచ్చి చెరువులో పడేశారా అని స్థానికంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
చుక్క నెత్తురు చిందించకుండానే పాక్‌ ఉక్కిరిబిక్కిరి!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
రైల్వే అభ్యర్ధులకు బిగ్‌ షాక్‌.. ఆ పరీక్షలు రద్దు చేసిన RRB..!
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
థియేటర్లలో స్టార్ హీరోస్ మూవీస్.. ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు,
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ప్రత్యర్థులను కవ్వించే విరాట్ ఇలా ఎందుకు మారాడో తెలుసా?
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
ఈ ఏడాది రెండో చంద్ర,సూర్య గ్రహణాలు ఎప్పుడు? సూత సమయం తెలుసుకోండి
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వేసవిలో కారు టైర్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెఫ్టీ ట్రిక్స్‌
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!
పదో తరగతి 2025 మెమోలపై..మార్కులతోపాటు పాస్, ఫెయిల్‌ ముద్రణ!
కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!
కేసీఆర్ సభలో అల్లు అర్జున్‌ ఫ్లెక్సీలు.. వైరల్‌ అవుతున్న ఫొటోలు!
నానోటెక్నాలజీతో కోవిడ్‌పై పతంజలి పరిశోధనలు..!
నానోటెక్నాలజీతో కోవిడ్‌పై పతంజలి పరిశోధనలు..!