AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో

ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా మారింది వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు దంచికొడుతున్నాయి.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది..

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. అక్కడా, ఇక్కడా వానలే వానలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Apr 08, 2025 | 8:31 AM

Share

ఓ వైపు వర్షాలు.. మరో వైపు ఎండలు.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుగా మారింది వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలు ఎండలు దంచికొడుతున్నాయి.. సాయంత్రం వేళ ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురుస్తోంది.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇదే..

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, సాయంత్రం వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది. నిన్న నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 41.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. మధ్యాహ్నం నుంచి మహబూబాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, జనగామ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఖమ్మంలో వడగళ్ల వాన కురవడంతో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 3 రోజులు వానలు

ఇక ఏపీ విషయానికి వస్తే.. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజులు వానలు పడనున్నాయి. అలాగే వచ్చే నాలుగు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని.. ఆ తర్వాత స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో మరో నాలుగు రోజులు కొన్నిచోట్ల వర్షాలు, కొన్నిచోట్ల ఎండలతో విభిన్నమైన వాతావరణం ఉంటుంది.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు