AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక జనగామ వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు..?

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు ఎంఎంటీఎస్ రైళ్లు విస్తృత సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను యాదగిరిగుట్ట మీదుగా జనగామ వరకు పొడిగించాలని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఎంపీ వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల విస్తరణ అంశాలపై చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత ఎంపీ […]

ఇక జనగామ వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 16, 2019 | 6:48 AM

Share

ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు ఎంఎంటీఎస్ రైళ్లు విస్తృత సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎంఎంటీఎస్ సర్వీసులను యాదగిరిగుట్ట మీదుగా జనగామ వరకు పొడిగించాలని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో ఎంపీ వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల విస్తరణ అంశాలపై చర్చించారు. సమావేశం ముగిసిన తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వివరాలను మీడియాకు తెలిపారు.

భువనగిరి రైల్వే స్టేషన్లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లను ఆపాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా శాతవాహన, పద్మావతి, కోణార్క్, మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లను ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేశానన్నారు. ఇక నడికుడి రూట్‌లో డబ్లింగ్ లైన్ చేయాలని, చిట్యాల-సిరిపుర రైల్వే స్టేషన్ల మధ్య గేటు వద్ద.. ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరినట్లు తెలిపారు. అంతేకాదు రామన్నపేట రైల్టే స్టేషన్‌లో పునర్నిర్మాణ పనులుతో పాటుగా.. ఇక్కడ చెన్నై, శబరి, డెల్టా ప్యాసింజర్ రైళ్లను నిలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. తాను చేసిన విజ్ఞప్తులకు రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారని.. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

స్విగ్గిలో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఇదే..!
స్విగ్గిలో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఇదే..!
నాన్వె జ్ రుచితో.. మీల్ మేకర్ గ్రేవీ! అన్నం చపాతీకి సూపర్ జోడీ
నాన్వె జ్ రుచితో.. మీల్ మేకర్ గ్రేవీ! అన్నం చపాతీకి సూపర్ జోడీ
కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
కెప్టెన్ మార్పుతో భారత్‎లో అడుగుపెడుతున్న బ్లాక్ క్యాప్స్!
నవరత్నాలు పొదిగిన చీరకు గిన్నిస్‌బుక్‌లో చోటు
నవరత్నాలు పొదిగిన చీరకు గిన్నిస్‌బుక్‌లో చోటు
సోషల్‌ మీడియా అకౌంట్లకు ఐటీ అధికారులకు యాక్సెస్‌ ఉంటుందా?
సోషల్‌ మీడియా అకౌంట్లకు ఐటీ అధికారులకు యాక్సెస్‌ ఉంటుందా?
అద్దిరిపోయే లుక్‌లో హార్ట్‌బీట్‌ నెక్లెస్‌! పార్టీలో మీరే స్పెషల్
అద్దిరిపోయే లుక్‌లో హార్ట్‌బీట్‌ నెక్లెస్‌! పార్టీలో మీరే స్పెషల్
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్‌కు తిరుగులేదంతే
SRHకు ఆ ప్లేయర్ బిగ్ ప్లస్ పాయింట్.. కావ్య స్కెచ్‌కు తిరుగులేదంతే
ప్యారడైజ్ సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్..
ప్యారడైజ్ సినిమాను మిస్సైన స్టార్ హీరోయిన్..
ఎంత ధైర్యం రా.. ఇంట్లోనే పెట్రోల్ పంపు తెరిచాడు..!
ఎంత ధైర్యం రా.. ఇంట్లోనే పెట్రోల్ పంపు తెరిచాడు..!
కాఫీ ప్రియులకు అలర్ట్! గ్లోయింగ్ స్కిన్ కావాలా లేక ముడతలు రావాలా?
కాఫీ ప్రియులకు అలర్ట్! గ్లోయింగ్ స్కిన్ కావాలా లేక ముడతలు రావాలా?