భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోధన, బోధనేతర సిబ్బంది సామూహిక నిరాహార దీక్ష, సమస్యల పరిష్కారం కోసం నిరసన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోధన, బోధనేతర సిబ్బంది సామూహిక నిరాహార దీక్షకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టిఎస్ యుటిఎఫ్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బోధన, బోధనేతర సిబ్బంది సామూహిక నిరాహార దీక్షకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టిఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కస్తూర్భా గాంధీ, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కలెక్టరేట్ దగ్గర చేపట్టిన ఈ సామూహిక నిరాహార దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రంలో 475 కస్తూర్భాగాంధీ విద్యాలయాలు, 29 అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయని వీటిలో అనేక మంది బోధన, బోధనేతర సింబ్బంది పనిచేస్తూ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగులు చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెల్త్ కార్డ్ లు కల్పించాలని, రెగ్యులర్ ఉపాధ్యాయులు మాదిరిగా సిఎల్స్ కల్పించాలని, డిమాండ్ చేశారు. ఈ నిరాహారదీక్షకు బీజేపీ జిల్లా కమిటీ మద్దతు తెలిపింది.