Telangana: ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్‌లోకి తీసుకోండి.. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు మాజీ ఎమ్మెల్యే సంచలన లేఖ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 119 స్థానాల్లో కాంగ్రెస్ 64 సీట్లను దక్కించుకుంది. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 సీట్లలో కాంగ్రెస్, సీపీఐ కూటమి 9 స్థానాలను దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 8, సీపీఐ 1 స్థానంలో గెలిచింది. భద్రాచలం ఒక్క స్థానంలో మాత్రమే భారత రాష్ట్ర సమితి గెలుపొందింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 119 స్థానాల్లో కాంగ్రెస్ 64 సీట్లను దక్కించుకుంది. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 సీట్లలో కాంగ్రెస్, సీపీఐ కూటమి 9 స్థానాలను దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 8, సీపీఐ 1 స్థానంలో గెలిచింది. భద్రాచలం ఒక్క స్థానంలో మాత్రమే భారత రాష్ట్ర సమితి గెలుపొందింది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయిన భద్రాచలంలో ఆ పార్టీ నేత పొదెం వీరయ్య రెండో సారి పోటీచేసి ఓడిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాళ్లలో పొదెం వీరయ్య ఒక్కరు మాత్రమే ఓడిపోవడంతో ఆ నియోజకవర్గంలోని పార్టీ నేతల్లో నిరుత్సాహం నెలకొంది. అయితే, అక్కడ కమ్యూనిస్టులు సహకరించలేదని పొదెం వీరయ్య ఆరోపిస్తున్నారు. ఇక్కడ పొదెం వీరయ్యపై పోటీ చేసిన BRS అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు.
అంతకుముందు భద్రాచలం టికెట్ కోసం కాంగ్రెస్ నుంచి తెల్లం వెంట్రావు కూడా ట్రై చేశారు. కానీ.. కుదరకపోవడంతో ఆయన పార్టీ మారి BRS నుంచి పోటీ చేసి గెలిచారు. సిట్టింగ్ MLA పొదెం వీరయ్య ఓటమి పాలవడం కాంగ్రెస్ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. మొదట్నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్న తనకు ఈసారి MLC ఇవ్వాలని పొదెం వీరయ్య కోరుతున్నారు. ఈ క్రమంలో తనను మండలికి పంపి మంత్రిని చేయాలని హైకమాండ్‌కు లేఖ రాశారు. 33 ఏళ్లుగా పార్టీలో విశ్వాసంగా ఉన్నానంటూ.. తన రాజకీయ ప్రస్థానం మొత్తాన్ని పొదెం వీరయ్య లేఖలో వివరించారు.
అయితే, ఇప్పటికే ఖమ్మం నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉండగా.. తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కేబినెట్‌లో ఉన్నారు. ఇక ఇప్పుడు వీరయ్య తనకు MLC పదవితోపాటు కేబినెట్ బెర్త్ కావాలంటున్నారు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి.. హైకమాండ్ దీనిపై ఎలా స్పందిస్తుంది..? అనేది ప్రస్తుతం పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..