Banswada: గాడిదపై నామినేషన్‌కు వచ్చాడు.. అడ్డుకున్న పోలీసులకు అదిరిపోయే రీజన్ చెప్పాడు
బాన్సువాడలో మాత్రం ఓ నిరుద్యోగి వినూత్న పద్దతిలో నామినేషన్ కు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు... నిరుద్యోగి గాడిదను తీసుకువచ్చి ప్రభుత్వ పాలనను ఎండగడుతూ విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం ఇప్పుడు అందరి దృష్టిని మరల్చింది..
రాష్ట్రంలో ఎన్నిలక హంగామా ఊపందుకుంది. నామినేషన్లను పైల్ చేయడంలో రకారకాల పద్దతులు, నిరసనలు చూస్తుంటాం…కాని బాన్సువాడలో మాత్రం ఓ నిరుద్యోగి వినూత్న పద్దతిలో నామినేషన్ కు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు… నిరుద్యోగి గాడిదను తీసుకువచ్చి ప్రభుత్వ పాలనను ఎండగడుతూ విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వంత నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం ఇప్పుడు అందరి దృష్టిని మరల్చింది.. బాన్సువాడ రిటర్నింగ్ అధికారి కార్యలయానికి ఓ యువకుడు గాడిదతో పాటుగా కోన్ని పత్రాలను తీసుకోని వచ్చాడు…అందరు లైట్ తీసుకున్నారు..కాని నేరుగా అతను బారికేడ్స్ దాటుకోని వేళ్లే ప్రయత్నం చేయడంతో ఆరా తీసిన పోలిసులు అవాక్కయ్యారు..
బీర్కూరు మండలానికి చెందిన భాస్కర్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తనకు ఉద్యోగం రాకపోవడంతో నామినేషన్ కేంద్రానికి గాడిదను ఆటోలో తీసుకువచ్చి నామినేషన్ కేంద్రానికి దానిపైకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గాడిద పై నామినేషన్ వేసి తన నిరసన తెలపాలని ప్రయత్నం చేయడంతో అతన్ని పోలిసులు అడ్డుకున్నారు..దాంతో అతడు ఆర్థనగ్నంగా అయిన వేళ్లి తన నామినేషన్ వేస్తానని ప్రయత్నం చేసాడు..కాని పోలిసులు అడ్డుకున్నారు… నామినేషన్ కేంద్రం వద్ద గాడిదను అడ్డుకున్న పోలీసులు నిరుద్యోగిని మాత్రం నామినేషన్ కేంద్రంలోకి అనుమతించారు.