AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: వారితో సంబంధాలు తెంచుకోండి: తెలంగాణ నేతలకు బండి సంజయ్ మాస్‌ వార్నింగ్

రాజకీయాల్లో ఉంటూ మావోయిస్టులతో ఉన్న సంబంధాలు ఉన్న నాయకులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర హెచ్చకలు జారీ చేశారు.రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలు వెంటనే వారితో సంబంధాలు తెంచుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.

Bandi Sanjay: వారితో సంబంధాలు తెంచుకోండి: తెలంగాణ నేతలకు బండి సంజయ్ మాస్‌ వార్నింగ్
Bandi Sanjay
Anand T
|

Updated on: Oct 19, 2025 | 5:43 PM

Share

మావోయిస్టులతో సంబంధాలు ఉన్న తెలంగాణలోని రాజకీయ నాయకులను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం సంచలన ట్వీట్ చేశారు. రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ.. మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా వెంటనే సాయుధ వర్గాలతో ఉన్న సంబంధాలను తెంచుకోండి. లేనిపక్షంలో మీ గుట్టు బయటపడుతుందని ఆయన హెచ్చరించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టు నిర్మూలనకే పరిమితం కావడం లేదు.. అవినీతి, నేరం, ఉగ్రవాద సంబంధాల నెట్వర్క్‌ను సైతం వెలికి తీస్తున్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు అని రాసుకొచ్చారు. దేశ అంతర్గత భద్రత విషయంలో తప్పు వైపు నిలబడితే ఎంతటి ఉన్నత నాయకులైనా పతనం కాక తప్పదు” అని ఆయన స్పష్టం చేశారు.

కర్తవ్య భవన్ లోకి కార్యాలయం

ఇదిలా ఉండగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం తన శాఖ కార్యాలయాన్ని కర్తవ్య భవన్ లోకి మార్చారు. సెంట్రల్ విస్టా రీ డెవలెప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా నిర్మించిన “కామన్ సెంట్రల్ సచివాలయం” ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత ఆగస్టు 6న ప్రారంభించిన సంగతి తెలిసిందే. సుమారు 1.5 లక్షా చదరపు మీటర్ల ప్లింట్ ఏరియా కలిగి ఉన్న ఈ భవనం, రెండు బేస్‌మెంట్‌లతో పాటు 7 అంతస్తులుగా నిర్మించారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు సహాయ మంత్రి నిత్యానందరాయ్ కార్యాలయాలు ఇప్పటికే కర్తవ్య భవన్ లోని లెవెల్ 5లోకి మారాయి. దీపావళి సందర్భంగా ఈరోజు మంచి మహూర్తం ఉండటంతో బండి సంజయ్ పూజారుల వేద మంత్రోచ్చారణల కర్తవ్య భవన్ లోకి మధ్య అడుగుపెట్టారు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనకు కేటాయించిన సీట్లో ఆశీసునలయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.