Bandi Sanjay: ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు.. కేటీఆర్‌ను ప్రశ్నించిన బండి సంజయ్
తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఉదయం లేచింది నుంచి రాత్రి వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అటు టీఆర్‌ఎస్, ఇటు బీజేపీ నేతల మధ్య మాటల..

తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ఉదయం లేచింది నుంచి రాత్రి వరకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అటు టీఆర్‌ఎస్, ఇటు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరుండటంతపై ఇంకా దుమారం లేపోతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తతున్నాయి. ఇందుకు ధీటుగా కేటీఆర్ సైతం బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి బండి సంజయ్ మళ్లీ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఫేస్‌లో భయం కనిపిస్తోందని, తంబాకు తింటానని నాపై ఆరోపించావు కదా.. మళ్లీ ఎందుకు ఇప్పుడు మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. డ్రగ్స్‌పై సిట్ నివేదిక ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
వేములవాడకు కేసీఆర్ ఇస్తానన్న రూ.400 కోట్లు ఏమయ్యాయని, అలాగే కవిత లిక్కర్ కేసు గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సంజయ్. నేను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తే కేటీఆర్ ఇప్పుడు స్పందించడం ఏంటని అన్నారు. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను విచారించాలని అన్నారు. నేను తంబాకు తింటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా.. ఇంటే బయటపెట్టాలని ప్రశ్నించారు. నేను ఎప్పుడు ఛాలెంజ్ చేస్తే ఇప్పుడు స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి