Drugs Case: న్యూఇయర్ వేళ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ఏం జరిగిందంటే..
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేశారు పోలీసులు. శివరాంపల్లిలోని పిల్లర్ నెంబర్ 290 వద్ద ఉన్న ప్రోవిడెంట్ కేన్వర్త్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సంధ్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద భారీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండు లక్షల విలువ చేసే 7.5 గ్రాముల డ్రగ్స్‌ను బాలానగర్ ఎస్ఓటి పోలీసులతో పాటు రాజేంద్రనగర్ పోలీసులు కలిసి పట్టుకున్నారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు లక్షల విలువైన డ్రగ్స్ ను పట్టుకున్నారు పోలీసులు. శివరాంపల్లిలోని పిల్లర్ నెంబర్ 290 వద్ద ఉన్న ప్రోవిడెంట్ కేన్వర్త్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సంధ్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి వద్ద భారీ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండు లక్షల విలువ చేసే 7.5 గ్రాముల డ్రగ్స్‌ను బాలానగర్ ఎస్ఓటి పోలీసులతో పాటు రాజేంద్రనగర్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఓ విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్.ఓ.టి పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులతో సంయుక్తంగా కలిసి దాడి నిర్వహించారు.
ఈ క్రమంలో సంధ్య అనే (26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగిని) వద్ద డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని తీసుకోవడానికి వచ్చిన అర్జున్ (25ఏళ్లు), దేవేందర్ (23ఏళ్లు) సాఫ్ట్వేర్ ఉద్యోగిని ట్రాప్ చేసి ముగ్గురిని ఓకే సారి పట్టుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని కోర్టుకు తరలించారు. దీని వెనుక ఎవ్వరు ఉన్నారు? డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు? అనేది దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..