విచిత్ర వైద్యం.. పసరు మందుతో సంతానం కలుగుతుందని ప్రచారం.. అక్కడికి దంపతుల క్యూ

ఇక్కడ చిత్రమైన వైద్యం కొనసాగుతోంది. పిల్లలు లేరని చెబితే..పసరు పోస్తున్నారు..ఈ పసరు తాగిన వాళ్లకు పిల్లలు పుడుతారనే నమ్మకం. దీంతో ప్రతి ఆదివారం ఇక్కడికి పిల్లలు లేని దంపతులు..

విచిత్ర వైద్యం.. పసరు మందుతో సంతానం కలుగుతుందని ప్రచారం.. అక్కడికి దంపతుల క్యూ
Follow us

|

Updated on: Feb 18, 2021 | 11:17 AM

ఇక్కడ చిత్రమైన వైద్యం కొనసాగుతోంది. పిల్లలు లేరని చెబితే..పసరు పోస్తున్నారు..ఈ పసరు తాగిన వాళ్లకు పిల్లలు పుడుతారనే నమ్మకం. దీంతో ప్రతి ఆదివారం ఇక్కడికి పిల్లలు లేని దంపతులు..క్యూ కడుతున్నారు. ఈ పసరు తాగడంతో చాలామందికి పిల్లలు పుట్టారని దంపతులు చెబుతున్నారు.  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన ఖలీమ్‌ అనే ఆర్‌ఎంపీ వైద్యుడు..చెట్ల మందులతో కూడా వైద్యం చేస్తున్నాడు. వంశపారం పర్యంగా వస్తున్న ఈ చికిత్స విధానంతో…సంతానంలేనివారికి చెట్ల పసరు పోస్తున్నారు. ఈ చెట్ల పసరుతో..పిల్లలు పుడుతున్నారని ఇక్కడి వారిలో గట్టి నమ్మకం ఏర్పడింది. దీంతో చాలా ఏళ్లుగా ఇక్కడ ఈ పసరు వైద్యం కొనసాగుతోంది.

పసరు మందు తాగిన మూడు నుంచి నాలుగు వారాల వ్యవధిలోనే ఆ మహిళలు గర్బం దాల్చుతారని, అయితే, ఈ పసరు మందుకు కొన్ని పాటించాల్సిన నియమ నిబంధనలు కూడా ఉన్నాయంటున్నారు. ఆ నిబంధనలు పాటిస్తే..ఖచ్చితంగా సంతానం కలుగుతుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ప్రతి ఆదివారం ఇక్కడ ఓ జాతరలా పసరు వైద్యం కొనసాగుతోంది. తమ పూర్వీకుల నుంచి చేస్తూ వస్తోన్న ఈ పసరు వైద్యంతో ఇప్పటికీ సుమారుగా 400లకు పైగా జంటలకు పిల్లలు జన్మించారని, పసరు వైద్యుడు చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే దంపతులు కూడా ఇదే చెబుతున్నారు. దీంతో స్థానిక ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పిల్లలు లేని దంపతులు పెద్ద సంఖ్యలో వచ్చి పసరు మందు తాగివెళ్తున్నారు.

ఇదిలా ఉంటే, డాక్టర్లు మాత్రం..ఈ పసరు వైద్యంతో పిల్లలు పుడతారనేది అబద్దమంటున్నారు. ఇది కేవలం అపోహా మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. ఇలాంటి పసర్లు తాగితే ఆరోగ్యానికి హాని జరుగుతుందని, అందులో ఎలాంటి వైద్యం లేదని, పైగా సైడ్‌ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Also Read:

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ‘కళ్యాణమస్తు’ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్.. 10 ఏళ్ల తర్వాత మళ్లీ

Telecom companies: మొబైల్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రానున్న రోజుల్లో పెరగనున్న ధరలు.. సన్నాహాలు చేస్తోన్న..

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!