Telangana: అయ్యో దేవుడా.. ఒగ్గు కథ చెప్తుండగా మాటలకందని విషాదం.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
ఆయనొక కళాకారుడు.. అరుదైన ప్రాచీన జానపద కళా రూపాల్లో ఒకటైన ఒగ్గు కళను పునికిపుచ్చుకున్నాడు. ఒగ్గు కథలు చెప్పడంలో దిట్ట.. అతని జీవనాధారం కూడా అదే.. ఇలా ఒగ్గు కథలు చెబుతూనే ప్రాణాలు కోల్పోయాడు.. ఒగ్గు కథ చెప్తుండగా తాను పట్టుకున్న మైక్‌కు కరెంట్ షాక్ తగలడంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు..

ఆయనొక కళాకారుడు.. అరుదైన ప్రాచీన జానపద కళా రూపాల్లో ఒకటైన ఒగ్గు కళను పునికిపుచ్చుకున్నాడు. ఒగ్గు కథలు చెప్పడంలో దిట్ట.. అతని జీవనాధారం కూడా అదే.. ఇలా ఒగ్గు కథలు చెబుతూనే ప్రాణాలు కోల్పోయాడు.. ఒగ్గు కథ చెప్తుండగా తాను పట్టుకున్న మైక్‌కు కరెంట్ షాక్ తగలడంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలో చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఒగ్గు కళాకారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ ఇంట్లో ఒగ్గు కథ చెప్తుండగా కరెంట్ షాక్ తగిలింది. అక్కడే కుప్పకూలాడు. పక్కన ఉన్న వృద్ధుడు సైతం ఉన్నపళంగా నేలపై పడిపోయాడు.
షాబాద్ మండలం చందనవెళ్లికి చెందిన సుదర్శన్ గౌడ్.. తన ఇంట్లో ఒగ్గుకథ చెప్పడానికి మొయినాబాద్ మండలం పెద్ద మంగళవారంకి చెందిన శివకుమార్ కళాబృందాన్ని పిలిపించారు. మంగళవారం మధ్యాహ్నం శివకుమార్ (28), అతని అనుచరులు ఒగ్గుకథ చెప్తున్నారు. ఈ క్రమంలో శివకుమార్ పట్టుకున్న మైక్‌కు కరెంట్ షాక్ తగిలింది. అంతే క్షణాల్లోనే శివకుమార్ నేలకొరిగాడు. అంతేకాకుండా అక్కడి వారంతా కూడా షాక్‌కు గురయ్యారు. తీవ్రగాయాలతో శివకుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేమనడానికి ఈ దృశ్యం ఉదాహరణ. అదే సమయంలో కరెంట్ వాడకం, కరెంట్‌తో పనిచేసే వస్తువులు సరిగ్గా ఉపయోగించలేకపోతే ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయో చెప్తోంది ఈ ఘటన. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వీడియో
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
