International Kite Festival: హైదరాబాద్‌లో 3 రోజులపాటు అంతర్జాతీయ పతంగి పండగ.. జనవరి 13 నుంచి ప్రారంభం! ఉచిత ప్రవేశం
తెలంగాణలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ పతంగి పండగ (ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్) జరగనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ గాలిపటాలు, స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. మూడేళ్ల విరామం తర్వాత ఈ పండుగను మళ్లీ నిర్వహించడం విశేషం. బేగంపేట హరిత ప్లాజాలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పోస్టర్‌ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు..
హైదరాబాద్, జనవరి 3: తెలంగాణలో మూడు రోజుల పాటు అంతర్జాతీయ పతంగి పండగ (ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్) జరగనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జనవరి 13 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ గాలిపటాలు, స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహించనుంది. మూడేళ్ల విరామం తర్వాత ఈ పండుగను మళ్లీ నిర్వహించడం విశేషం.
బేగంపేట హరిత ప్లాజాలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పోస్టర్‌ను పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం (జనవరి 2) ఆవిష్కరించారు. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని, 16 దేశాలకు చెందిన 40 మంది అంతర్జాతీయ గాలిపటాల ఆటగాళ్లు, 60 మంది జాతీయ పతంగుల క్లబ్ సభ్యులు 3 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొని వివిధ డిజైన్లతో కూడిన పతంగులను ఎగురవేస్తారని తెలిపారు.
ఇక స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను స్టాల్స్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. వేదిక వద్ద హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, పతంగుల పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్‌ఎంసీ, పోలీసు, ఇతర శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ ఎగ్జిబిషన్‌కు అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.