IIT Guwahati Student Died: అస్సాంలో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి! హోటల్ రూంలో విగత జీవిగా.. ఏం జరిగిందో?
అస్సాంలోని ఐఐటీ గువాహటిలో ఇంజినీరింగ్ చదువుతున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. మృతురాలిని పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఐఐటీ గువాహటిలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్ధినిగా పోలీసులు దృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ గువాహటిలో ఈసీఈ చదువుతున్న ఐశ్వర్యతో పాటు ఆమె ముగ్గురు స్నేహితులు..
గువహటి, జనవరి 3: అస్సాంలోని ఐఐటీ గువాహటిలో ఇంజినీరింగ్ చదువుతున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. మృతురాలిని పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఐఐటీ గువాహటిలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్ధినిగా పోలీసులు దృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐఐటీ గువాహటిలో ఈసీఈ చదువుతున్న ఐశ్వర్యతో పాటు ఆమె ముగ్గురు స్నేహితులు నూతన సంవత్సరం వేడుకల నిమిత్తం ఐఐటీ క్యాంపస్‌కు 25 కి.మీల దూరంలోని ఓ హోటల్‌లో రెండు గదులను బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 31 రాత్రి వారంతా హోటల్‌లో పార్టీ చేసుకున్నారు. జనవరి 1న ఉదయం తనతోపాటు గదిలో ఉన్న మరో స్నేహితురాలు వాష్‌రూమ్‌కు వెళ్లగా.. అక్కడ ఐశ్వర్య విగత జీవిగా పడి ఉంది. గమనించిన తోటి స్నేహితులు ఆమెను గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఐశ్వర్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హోటల్ సిబ్బందిని, ఐశ్వర్య స్నేహితులను పోలీసులు విచారించారు. డిసెంబర్ 31న అర్ధరాత్రి హోటల్ తనిఖీలో భాగంగా వీరు బుక్ చేసుకున్న గదులకు వెళ్లి చూడగా.. ఐశ్వర్యతో పాటు ఆమె స్నేహితులు మత్తులో ఉన్నట్లు సిబ్బంది చెప్పారని పోలీసులు వెల్లడించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
కాగా ఐశ్వర్య ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఆమెతో పాటు మరో విద్యార్ధిని, ఇద్దరు మగ విద్యార్థులు హోటల్‌లో ఉన్నారు. విద్యార్థిని మృతి పట్ల ఆమె కుటుంబానికి సానుభూతి తెలుపుతూ ఐఐటీ-గౌహతి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.