Treatment: అలాంటి సమయంలో జరగరానిది జరిగితే, వైద్యుడిదే బాధ్యత.. తేల్చి చెప్పిన..
ఆఫీస్ వర్క్ మొదలు చివరికి వైద్యం కూడా ఫోన్‌ల ద్వారా జరుగుతోన్న రోజులివి. టెలిఫోనిక్ సంప్రదింపుల ద్వారా వైద్యం చేస్తున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. ఒక వైద్యుడు తనకు తెలియని విషయాలను మరో వైద్యుడితో ఫోన్‌లో మాట్లాడుతూ రోగికి చికిత్స అందిస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇలాటి సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే దానికి ముమ్మాటికీ..
టెక్నాలజీ పెరిగిన తర్వాత మనుషులు పనులు చాలా సులభంగా మారిపోయాయి. ఒకప్పుడు పోస్ట్ కార్డు వేస్తే కానీ సమాచారం తెలిలేసి కాదు కానీ నేడు ఒక్క క్షణంలో ప్రపంచంలో ఎక్కడో ఉన్న వారితోనూ మాట్లాడే రోజులు వచ్చేశాయ్. ప్రపంచలో ఏదో మూలన ఉన్న వారితోనూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటుటున్నాం.
ఆఫీస్ వర్క్ మొదలు చివరికి వైద్యం కూడా ఫోన్‌ల ద్వారా జరుగుతోన్న రోజులివి. టెలిఫోనిక్ సంప్రదింపుల ద్వారా వైద్యం చేస్తున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. ఒక వైద్యుడు తనకు తెలియని విషయాలను మరో వైద్యుడితో ఫోన్‌లో మాట్లాడుతూ రోగికి చికిత్స అందిస్తున్న సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇలాటి సమయంలో ఏదైనా జరగరానిది జరిగితే దానికి ముమ్మాటికీ ఆ వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని జాతీయ వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్ స్పష్టం చేసింది.
2003లో రాంచీలోని ఓ ఆసుతప్రిలో యువకుడి మరణానికి సంబంధించి కమిషన్ ఈ తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. 2003లో రాంచీకి చెందిన ఓ యువకుడికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో తన తండ్రి ఆసుపత్రిలో చేర్చాడు. అయితే ఆ సమయంలో ఓ జూనియర్ డాక్టర్ ఫోన్ కాల్‌లో సీనియర్ సూచనలు పాటిస్తూ చికిత్స అందించాడు. అయితే నొప్పి ఏమాత్రం తగ్గలేదు. అల్ట్రా సౌండ్ స్కాన్ పరీక్ష చేసిన సమయంలో రోగి ‘ప్యాంకియాటైటిస్’తో బాధపడుతున్నట్లు తేలింది.
అయితే సీనియర్ డాక్టర్ మాత్రం రిపోర్ట్‌ను పట్టించుకోలేదు. రాత్రి నొప్పి మరింత తీవ్రం కావడంతో రోగిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్పించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా అతడి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. అనంతరం వైద్యులు పరీక్షలు నిర్వహించగా యువకుడి మృతికి ప్యాంక్రియాటైటిస్ కారణమని తేలింది. వ్యాధిని సకాలంలో గుర్తించలేకపోవడం వల్లే తన కుమారుడు మరణించాడని తండ్రి.. జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే వైద్యుడి నిర్లక్ష్యం కారణం అయినప్పటికీ, రాష్ట్ర కమిషన్ మాత్రం ఆసుపత్రికే అనుకూలంగా తీర్పునిచ్చింది.
దీంతో రాష్ట్ర ప్యాలెన్‌కు వ్యతిరేకంగా బాధితుడి తండ్రి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. కేసుకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకున్న జాతీయ కమిషన్ వైద్యుడితే తప్పంటూ తేల్చి చెప్పింది. బాధితులకు న్యాయపరమైన ఖర్చుపై వడ్డీతో కలిపి రెండు నెలల్లో పరిహారం అందించాలని ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..