Tapping Politics: మరో మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు.. కొత్త రాజకీయ ప్రకంపనలు..!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే బీఆర్‌ఎస్ పార్టీనే రద్దు చేయాలని తెలంగాన బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే బీఆర్‌ఎస్ పార్టీనే రద్దు చేయాలని తెలంగాన బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణలో ట్యాపింగ్ కేసు కొత్త రాజకీయ వివాదానికి తెరలేపింది. కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి. లీగల్ నోటీసులతో తనను బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బాధ్యులెవరో తేల్చాలని డీజీపీకి ఫిర్యాదు చేస్తే పరువు తీసినట్లా అని యెన్నం ప్రశ్నించారు. కేటీఆర్ రెచ్చిపోయి నోటీసులు పంపారని, విచారణ ఎందుకు చేస్తున్నారని DGPకి కూడా నోటీసులు పంపాలన్నారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్నారు.
అసలు బీఆర్‌ఎస్ పార్టీనే రద్దు చేయాలన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. నాడు షాడో సీఎంలా వ్యవహరించి నేడు తెలియదంటే ఎలా అన్ని ప్రశ్నించారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ ఈడీని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుంటున్నాయని బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇదిలావుంటే, ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌లో కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్ స్పందించారు. క్షమాపణలు అడిగే ప్రసక్తే లేదని.. ఏదైనా లీగల్‌గానే ఫేస్ చేస్తామన్నారు. చూడాలి మరీ ఈ వ్యవహారం ఎటు వైపు దారి తీస్తుందో..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…