Viral Video: మందుబాబు మైండ్ బ్లోయింగ్ ఐడియా.. వీడియో చూస్తే సలాం కొట్టాల్సిందే..
మందంటే మద్యం ప్రియులకు పండుగే.. ఆ మందు కోసం యుద్దాలు చేయమన్నా సై అంటారు . ఆ మందు దొరక్కపోతే ప్రాణం పోయినట్టే అన్నట్టుగా వ్యవహరిస్తారు. మందు కోసం ఎంతటి కష్టాలైన ఎదుర్కుంటారు. మద్యనిషేదం ఉన్న ప్రాంతాల్లో అయితే మందు బాబుల కష్టాలు చెప్పనక్కర్లేదు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో చూసేయండి..
మందంటే మద్యం ప్రియులకు పండుగే.. ఆ మందు కోసం యుద్దాలు చేయమన్నా సై అంటారు . ఆ మందు దొరక్కపోతే ప్రాణం పోయినట్టే అన్నట్టుగా వ్యవహరిస్తారు. మందు కోసం ఎంతటి కష్టాలైన ఎదుర్కుంటారు. మద్యనిషేదం ఉన్న ప్రాంతాల్లో అయితే మందు బాబుల కష్టాలు చెప్పనక్కర్లేదు. అలాంటి ఓ మందు బాబు వినూత్నంగా ఆలోచించాడు. కానీ పోలీసుల కళ్లు కప్పలేకపోయాడు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆదిలాబాద్ జిల్లా భీంసరి గ్రామానికి చెందిన మునీశ్వర్ సత్యనారాయణ అనే వ్యక్తి అక్రమ మద్యాన్ని తరలించేందుకు బ్రహ్మండమైన ఐడియా వేశాడు. అందుకు ఏ వాహనాలు, సాధనాలు వినియోగించలేదు. కేవలం అతను ధరించిన దుస్తులనే సాధనంగా వాడుకున్నాడు. అతను ధరించే బనీయన్‌కి ఏకంగా 54 జేబులు కుట్టించుకున్నాడు. ఆ ఈశ్వరునికి కూడా దొరకను పో అన్నంత ధీమాలో అనుకున్నట్టుగానే మహారాష్ట్రలోని 48 దేశీదారు సీసాలు కొనుగోలు చేసి.. ఆ జేబుల్లో దాచుకుని ఆదిలాబాద్‌కు బయలుదేరాడు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో దిగడమే ఆలస్యం.. రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అదెలా అంటారా.? చూడటానికి సన్నగా ఉన్నా.. చాతి ఉబ్బి ఉండటం.. నడకలో తేడా గమనించిన పోలీసులకు అనుమానం వచ్చి చెక్ చేయగా మునీశ్వర్ బనియన్లో మద్యం బాగోతం బట్టబయలైంది. ఇంకేం మద్యాన్ని స్వాధీనం చేసుకుని సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

